ఎగ్జామ్ కోసం  చొక్కాలు చించేసుకున్నారు 

The authorities have implemented strict rules in IIT entrance exam

11:51 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

The authorities have implemented strict rules in IIT entrance exam

శుభ్రంగా చొక్కా వేసుకోరా అని చెప్పడం చూసాం. కానీ చింపిరి చొక్కా అయినా పర్వాలేదు .. ఎగ్జామ్ రూల్స్ ప్రకారం ఉండాలనే నిబంధన కొందరు విద్యార్ధుల పాలిట శాపమైంది. అప్పటికప్పుడు చొక్కాలు చించే సుకున్నారు. అలాగే చెవికి దుద్దులు , మెదలు గొలుసు వేసుకొచ్చిన అమ్మాయిల పరిస్థితీ అంతే. ఈ వింత రూల్స్ ఎక్కడో కాదు మనదేశం లోనే. వివరాల్లోకి వెళ్తే, ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కోసం విశాఖపట్నంలో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్ష నిర్వహించాలన్న ఉద్దేశంతో అధికారులు అమలు చేసిన కఠిన నిబంధనలు విద్యార్థులు చొక్కాలు చించుకోవాల్సిన పరిస్థితిని తెచ్చాయి.

విద్యార్థులు పూర్తి చేతుల చొక్కా (ఫుల్‌ హ్యాండ్స్‌) వేసుకుని రాకూడదని పరీక్ష నిర్వాహకులు సూచించారు. చాలామంది ఆ విషయాన్ని మర్చిపోయి పూర్తి చేతుల చొక్కాతో చేరుకున్నారు. సిబ్బంది లోపలకు అనుమతించకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఎదురైంది. సమీపంలోని దుకాణాలకు వెళ్లి బ్లేడులు, కత్తెరలు తీసుకుని చొక్కాలను కత్తిరించుకున్నారు. మొట్టమొదటిసారిగా ప్రతీ విద్యార్థి నుంచి బయోమెట్రిక్‌ విధానంలో వేలిముద్రలు, ముఖం ఫొటోలను కూడా పరీక్ష కేంద్రాల వద్ద తీసుకున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష కాగా ఉదయం 7.30 గంటలకే రావాలని అధికారులు సూచించడంతో ప్రతి విద్యార్థి ఆ సమయానికే చేరుకున్నారు. బూట్లు వేసుకుని వచ్చినవారు వాటిని పరీక్ష ప్రాంగణం బయటే వదిలేసి వెళ్లారు. డిజిటల్‌ వాచీలకు అనుమతి లేకపోవడంతో చాలా మంది వాచీలు కూడా పెట్టుకోకుండా హాజరయ్యారు. గొలుసులు, చెవి దిద్దులు, రింగులతో వచ్చిన యువతులను కూడా లోపలకు అనుమతించలేదు. ఫలితంగా వారు ఆయా ఆభరణాలను తీసి తమతో వచ్చిన తమ తల్లిదండ్రులకు, బంధువులకు అప్పగించాల్సి వచ్చింది. విశాఖ నగరంలోని పరీక్ష కేంద్రాలను విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల విద్యార్థులకు కేటాయించారు. పక్క జిల్లాల నుంచి చాలామంది విద్యార్థులు ఒంటరిగానే వచ్చారు. వీరు తమ విలువైన వస్తువులను ఎవరికి ఇవ్వాలో తెలియక అవస్థలు పడ్డారు. అయితే కొంతమంది విద్యార్థినుల అవస్థలను గమనించిన సిబ్బంది కనికరించి ప్రాంగణంలోకి అనుమతించారు. ఇదండీ మన పరీక్షల రూల్స్ ....

English summary

The authorities have implemented strict rules in IIT entrance exam