ఐ పాడ్ కన్నా ఈ పాప బరువు తక్కువే!

The baby weight is less than i pad weight

01:01 PM ON 23rd November, 2016 By Mirchi Vilas

The baby weight is less than i pad weight

సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందో, వైద్య శాస్త్రం కూడా అలానే వృద్ధి చెందుతూ వస్తోంది. అందునా భారతీయులు వీటిల్లో ముందంజలో వుంటున్నారు. తాజాగా భారతీయుడి నేతృత్వంలోని వైద్య బృందం ఘన విజయం సాధించింది. అబుదాబిలో నెలలు నిండని గర్బిణి ఆడ బిడ్డను ప్రసవించేలా సాయపడింది. ఈ శిశువు బరువు ఐపాడ్ కన్నా తక్కువగా అంటే 631 గ్రాములు ఉంది. కేవలం 26.5 వారాల గర్భిణి ఈ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విజయానికి నేతృత్వం వహించిన డాక్టర్ గోవింద షెనాయ్ మాట్లాడుతూ తల్లి తీవ్రమైన అపాయంలో ఉన్నపుడు సకాలంలో ప్రసవమై, బిడ్డకు జన్మనిచ్చేలా చేయడం చాలా ముఖ్యమైన విషయమని తెలిపారు.

తల్లికి గర్భధారణకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఉన్నాయన్నారు. దీంతోపాటు అధిక రక్తపోటు, అవయవాలకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. అటువంటి సమయంలో వైద్యులు సకాలంలో సరైన చర్య తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయమని, ప్రసవానంతరం తల్లీబిడ్డలను నిపుణుల పర్యవేక్షణలో ఉంచినట్లు చెప్పారు. ఈ బిడ్డ జననం ఓ అద్భుతంగా చెప్పుకొచ్చారు.

English summary

The baby weight is less than i pad weight