ఫొటో ఆఫ్‌ ద ఇయర్‌

The Best Photo of the Year

10:27 AM ON 19th February, 2016 By Mirchi Vilas

The Best Photo of the Year

యుద్ధాన్ని తలపించే పరిస్థితులు.. తినడానికి తిండి లేదు.. ఉండేందుకు నీడ కరువు.. ఎటువైపు నుంచి చావు ముంచుకు వస్తుందో తెలియని కల్లోల వాతావరణం.. కంటపడితే కడతేర్చే ముష్కర మూకలు.. కన్ను పొడుచుకున్నా కానరాని కారు చీకట్లు.. ఇలాంటి భయానక పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో దేశ సరిహద్దులు దాటే వారు ఎందరో.. పసి పిల్లలను చేతబట్టుకొని శరణార్థులుగా పొరుగు దశం తలుపు తట్టేవారు కోకొల్లలు. సిరియా ప్రజల ఆకలికేకలు.. ప్రాణాల కోసం వారి ఆర్తనాదాలు.. ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఇలాంటి ఒక ఛాయాచిత్రమే ఫొటో ఆఫ్ ద ఇయర్ గా ఎన్నికైంది. గురువారం ప్రకటించిన

ప్రపంచ ప్రెస్‌ ఫొటో అవార్డుల్లో ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్‌ రిచర్డ్‌సన్‌ తీసిన ఓ ఫొటోకి ఈ ఘనత దక్కింది. సెర్చియా-హంగేరి సరిహద్దు నుంచి శరణార్థులు పారిపోతుండగా.. నెలల పసిగుడ్డును ఐరన్ ఫెన్సింగ్‌ కింది నుంచి మరో వ్యక్తికి అందిస్తున్న ఈ బ్లాక్ అండ్ వైట్ లో ఈ ఫొటోను తీశాడు. హోప్ ఫర్ న్యూ లైఫ్ పేరుతో ఈ ఫొటోకు లేటెస్ట్ న్యూస్ కేటగిరిలోనూ.. ఫస్ట్ ప్రైజ్ దక్కింది. ఇక నేపాల్‌లో సంభవించిన భూప్రళయానికి సంబంధిన ఫొటోకు ఈ కేటగిరిలో రెండో బహుమతి లభించింది. 128 దేశాల నుంచి 5,775 మంది ఫొటోగ్రాఫర్లు.. 82,951 ఫొటోలను ఈ కాంపిటీషన్ కు పంపారు.

English summary

Anonymous and unpublished, Warren Richardson’s black-and-white photograph—a blurred night picture of a refugee handing a baby to another man on the Hungarian-Serbian border.This photograph has got first prize in Hope For The New life.This photo was taken by Australian Photographer Richard Son