పవర్ తో పనిలేదంటున్న కూలర్

The Cooler don't need power

06:37 PM ON 12th May, 2016 By Mirchi Vilas

The Cooler don't need power

స‌మ్మ‌ర్‌లో ఉష్ణోగ్ర‌త‌లు మండిపోతున్నాయి. బ‌య‌ట‌కు వ‌స్తే సెగ‌లు క‌క్కాల్సిందే. ఎండ వేడికి తట్టుకోలేక రోడ్ల పైకి జనాలు రావడం మానేశారు. ఎండ నుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటే ఇళ్లు చ‌ల్ల‌గా ఉండాల్సిందే. ఇళ్లు చ‌ల్ల‌గా ఉండాలంటే మధ్యతరగతి వాళ్లు ఏసీ కాకున్నా.. కనీసం కూలర్ అయినా కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏసీలు పెట్టుకున్న వాళ్లు కూల‌ర్ కొనుక్కున్నా క‌రెంటు బిల్లు మాత్రం పేలుతుంది. కూల‌ర్ కొనాల‌న్నా రూ 7-8 వేలు పెట్టాల్సిందే. మ‌రి ఇంత రేటు కూడా పెట్ట‌లేని వాళ్ల ప‌రిస్థితి ఏంటి? ఈ ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఎకో కూలర్. కేవలం ఓ అట్టముక్క, కొన్ని ప్లాస్టిక్ సీసాలు ఉంటే చాలు. మీకు ఎకో కూలర్ రెడీ.

బయటి ఉష్ణోగ్రతతో పోల్చితే ఓ ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ తేడా ఉండేలా చేసే ఈ ఎకో కూలర్‌కు కరెంటు అవసరమే లేదు. ఈ ఎకో కూల‌ర్ ఎలా త‌యారు చేస్తారంటే ముందుగా ఓ అట్టముక్క తీసుకుని దానికి చిన్న చిన్న రంద్రాలు చేసి, డబ్బాలను సగానికి కత్తిరించి.. సీసా మూతులను రంధ్రాల్లోకి ఉండేలా చేయాలి. ఆ అట్టముక్కను కిటికీకి పెడితే చాలు.. చల్లటి, స్వచ్ఛమైన గాలి మీ సొంతం. వడగాలి ఎంత వీస్తున్నా.. మీకు చల్లటిగాలి వస్తుంది. బయటి నుంచి గాలి చిన్న రంధ్రం ద్వారా లోపలికి వస్తున్నప్పుడు పీడనానికి లోనయి.. ఉష్ణోగ్రత తగ్గేలా చేస్తుందని తెలుసుకున్న బంగ్లాదేశ్ ప్రజలు చక్కటి ఐడియాతో, ఏమాత్రం ఖర్చు లేకుండా వేసవిని చల్లగా గడుపుతున్నారు. మరీ మీరూ ట్రై చేయండి. వారు ఏ విధంగా తయారు చేశారో మీరూ చూడండి…


English summary

The Cooler don't need power. The Eco Cooler in Bangladesh don't need power.