అలాంటి దేశం ఉంటుందా

The country with less than 1000 popolation

11:59 AM ON 22nd December, 2015 By Mirchi Vilas

The country with less than 1000 popolation

మనకి తెలిసి భారత దేశ జనాభా 126 కోట్లు . ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది . అదే ఒక దేశంలో 1000 మంది జనాభా కూడా లేరంటే మీరు నమ్ముతారా..!!

అసలు అలాంటి దేశం ఉంటుందా... ఎం చెబుతున్నారు ఆనుకుంటుంన్నారా. మేము చెప్పేది అక్షరాలా నిజం పట్టుమని వెయ్యిమంది కూడా జనాభా లేని దేశం 'వాటికన్‌సిటీ' . రోమ్‌ దేశంలో ఉన్న ఈ సిటీని అందరూ ఒక ప్రత్యేక దేశంగా భావిస్తారు. ఈ దేశాన్ని రోమ్‌ భిషప్‌ (పోప్‌) పరిపాలిస్తుంటారు.

వాటికన్‌ సిటీ ప్రపంచంలో అత్యంత చిన్నదైన దేశం. ఈ దేశం వైశాల్యం కేవలం 100 ఎకరాలు మాత్రమే. ఈ దేశం రోమ్‌లో ఉన్నప్పటికి వాటికన్‌ సిటీ తమ సొంత స్టాంప్‌లు, పాస్‌పోర్టులు, లైసెన్స్‌ ప్లేట్లు వంటివే కాక సొంత జెండా,జాతీయ గీతం వంటివి కూడా ఉన్నాయి.

వాటికన్‌ సిటీలో మ్యూజియమ్‌ లు 9 మైళ్ళ మేరకు ఉన్నాయి. మ్యూజియం లో ఉన్న ఒక్కో పెయింటింగ్‌కు సగటున ఒక నిమిషం కేటాయిస్తే ఆ మ్యూజియం లోని పెయింటింగ్‌ లను అన్నింటినీ చూడడానికి సుమారు 4 ఏళ్ళ పడుతుందట. ప్రపంచం నలుమూలల నుండి వాటికన్‌ సిటీని చూడడానికి అనేక మంది యాత్రికులు వస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ దేశాన్ని వీలు కుదుర్చుకుని మీరు ఓసారి వెళ్ళిరండి.

English summary

Vatican City is the Country in which there were less than 1000 population. This was in Rome country but Vatican city is treated as a special country in the world. Every year lakhs of tourists visit Vatican City