నల్లగా ఉన్నావని గేలి చేసారు.. కానీ ఆమె సూపర్ స్టార్ అయింది(వీడియో)

The darkest model in the world - Khoudia Diop from Senegal

05:46 PM ON 1st November, 2016 By Mirchi Vilas

The darkest model in the world - Khoudia Diop from Senegal

సాధారణంగా నలుపు రంగులో ఉన్నవారిని సమాజంలో ఎలాంటి చిన్న చూపు చూస్తారో అందరికీ తెలిసిందే. వారి ఎదురుగా అనకపోయినా వెనుక మాటుగా ఎన్నో కామెంట్లు, జోకులు విసురుతుంటారు. కొన్ని సందర్భాల్లోనైతే కొందరు ఏకంగా అలాంటి వారిని ఎదురుగానే కామెంట్లు చేస్తుంటారు. అలాంటప్పుడు చాలామంది తీవ్రంగా కుంగిపోతారు. మానసిక ఒత్తిడికి లోనవుతారు. తాము అలా పుట్టినందుకు తమను తామే నిందించుకుంటారు. కానీ ఆ యువతి మాత్రం అలా చేయలేదు. తనపై చేసిన కామెంట్లను ఆమె పట్టించుకోలేదు. నల్లగా ఉన్నావని ఎగతాళి చేసినా కుంగిపోలేదు. అవే కామెంట్లను స్పోర్టివ్ గా తీసుకుంది. తానేంటో నిరూపించాలనుకుంది. అనుకున్న విధంగానే చేసి చూపి తన సత్తా చాటింది. నవ్విన నాప చేనే పండుతుందన్న చందంగా ఈమెను గెలిచేసినవారే ఇప్పుడు నోరెళ్ళ బెడుతున్నారు. ఇంతకీ ఆమె ఏం సాధించిందనే విషయమై వివరాల్లోకి వెళ్తే...

1/8 Pages

ఆమె పేరు ఖౌడియా డియోప్. వయస్సు 19 ఏళ్లు. పశ్చిమ ఆఫ్రికాకు చెందిన ఈమె ప్రస్తుతం కెరీర్ కారణంగా పారిస్ లో ఉంటోంది. అయితే డియోప్ చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంది.

English summary

The darkest model in the world - Khoudia Diop from Senegal