స్వర్గానికి, నరకానికి మధ్య ఉన్న తేడా తెలుసా?

The Difference Between Hell And Heaven

11:49 AM ON 18th July, 2016 By Mirchi Vilas

The Difference Between Hell And Heaven

అసలు ఈ ప్రశ్న అంతుచిక్కనిది. ఎందుకంటే, స్వర్గం నరకం ఉన్నాయని కొందరు, లేవని మరికొందరు వాదిస్తుంటారు. అదంతా పక్కన పెడితే, ఓ స్కూల్ లో ఓ తమాషా జరిగింది. ఆ స్కూల్లో, ఓ పిల్లాడికి ఏదైనా కొత్త విషయం తెల్సుకోవాలనే కుతూహులం ఎక్కువగా ఉండేది. అందుకే ఓ రోజు తన టీచర్ తో ..టీచర్ ,టీచర్ స్వర్గం అంటే ఏమిటి? నరకం అంటే ఏమిటి? అసలు రెండిటికి మధ్య ఉన్న తేడా ఏంటి? అని ఆ పిల్లాడు అడిగాడు. అందుకు టీచర్ సరే పిల్లలు రేపు ఉదయం అందరూ త్వరగా వచ్చేయండి మీకు స్వర్గాన్ని, నరకాన్ని చూపిస్తా వాటిని చూశాక ఆ తేడా ఏంటో మీరే స్వయంగా నాకు చెప్పండి అని టీచర్ చెబుతుంది.

ఏదో కొత్త విషయం తెలుస్తుందన్న ఉద్దేశ్యంతో మరుసటి రోజు పిల్లలంతా ఉత్సాహంగా స్కూల్ కు వస్తారు. అన్నమాట ప్రకారం నరకాన్ని, స్వర్గాన్ని చూపించడానికి పిల్లల్ని ఆ టీచర్ తీసుకెళుతుంది. ముందు నరకం చూపిస్తానని టీచర్ చెబుతుంది.

వీళ్లు వెళ్లిన సమయంలో, అక్కడ లంచ్ టైమ్ కావడంతో, నరకంలో ఉన్నవాళ్లంతా భోజనాలకు కూర్చుంటారు. వారి, వారి ప్లేట్లలో,.పంచభక్ష పరమన్నాలుంటాయి. కానీ వాటిని తినలేక పోతుంటారు అక్కడి వారు. వారందరి చేతికి ఇనుప ముల్లులతో కూడిన కడియాలు వేసి ఉండడమే అందుకు కారణం. తిందామని పదార్థాలను చేతితో దగ్గరికి తీసుకొని తినేలోపు, ఆ చేతికడియానికి ఉన్న ముళ్లు మూతికి గుచ్చుకుంటుంటాయి. దీంతో ప్లేట్లో పంచభక్షపరమన్నాలు ఉన్నప్పటికీ, వాటిని తినలేక, అర్థాకలితోనే నరకంలో ఉన్నవాళ్లకు, పూటగడుపుకోవాల్సి వస్తుంది.

ఆ తర్వాత టీచర్ పిల్లలందరినీ,.స్వర్గానికి తీసుకెళుతుంది..ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ . ఇక్కడి వారి చేతికి కూడా ముళ్ల కడియాలు వేయబడి ఉంటాయ్, వీరి ప్లేట్లలో కూడా పంచభక్షపరమన్నాలుంటాయ్.. అయినప్పటికీ వీరు హాయిగా, ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా తమ ముందున్న ఆహారాన్ని కడుపునిండా తినేస్తుంటారు.

ఈ రెండు ఘటనలు చూపించిన టీచర్, పిల్లలూ మీరేం గమనించారు.? అని అడుగుతుంది. నరకంలోని వారి చేతికి ఇనుపముళ్లుల కడియాలు ఉన్నాయి, స్వర్గంలో ఉన్న వారి చేతికి కూడా ఇనుపముళ్లుల కడియాలు ఉన్నాయి, వారి ముందు పంచభక్ష పరమన్నాలు,వీరి ముందు కూడా అవే అయితే అక్కడి వారు తినలేక పోయారు, ఇక్కడ వారు కడుపునిండా తిన్నారు. ఇదెలా సాధ్యం అయ్యిందంటే, నరకంలోని వాళ్లు తినడానికి ట్రై చేసినప్పుడు చేతి కడియపు ముళ్లు వారి మూతికి గుచ్చుకున్నాయి. అయితే స్వరంలో వున్నవాళ్లు, తాము తినకుండా తమ ముందు వారికి తినిపిస్తున్నారు. స్వర్గంలోని వారంతా, ఇలా ఒకరికొకరు తినిపించుకున్నారు దీని కారణంగా చేతి కడియానికున్న ముళ్ళు వీళ్లకు గుచ్చుకోలేదు. తామే తినడానికి ట్రై చేసిన నరకంలోని వారికి మాత్రం అవి గుచ్చుకున్నాయి. అదీ తేడా. ఎదుటి వారికి పెడితే, మనకు ఎదుటివాళ్ళు పెడతారు. ఈ కాన్సెప్ట్ వలన స్వర్గంలోని వాళ్ళు హాయిగా భుజించారు. ఎదుటి వారికి పెట్టే గుణం లోపించడం వలన నరకంలో వాళ్ళు అన్నీ వున్నా ఏమీ తినలేని దుస్థితి లో వున్నారు. అదే నరాకానికి , స్వర్గానికి గల తేడా అంటూ టీచర్ వివరించేసరికి పిల్లలకు పూర్తిగా అర్ధం అయింది.

English summary

We all were very interested to know about what is hell and what is heaven here is one small example to what is Hell and what is Heaven