ఇవన్నీ అబద్ధాలే ... 2016 లో చక్కర్లు కొట్టిన ఘటనలు

The fake news that gone viral in India in 2016

12:44 PM ON 29th December, 2016 By Mirchi Vilas

The fake news that gone viral in India in 2016

ఆ మధ్య ఓ సినిమాలో 'అంతా అబద్ధం...' అంటూ ఆపాట ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో, ఏం వచ్చినా ముందు నమ్మేస్తున్నారు. ఆతర్వాత అబద్ధమని తేలాక మోసపోయామని అనుకోవడం రివాజైపోయింది. ప్రస్తుత 2016 సంవత్సరం ముగిసి, 2017 లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఎన్ని అబద్ధాలు ప్రచారం అయ్యాయో , ఎన్ని విపరీతంగా చక్కర్లు కొట్టాయో చూస్తే, ఈ ఏడాది షికార్లు చేయని పుకార్లు చాలానే వున్నాయి. వాట్సప్ సహా ఇతర సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి చివరికి ప్రసార మాధ్యమాల్లోకి వచ్చి మీడియాలో హల్ చల్ సృష్టించాయి. యునెస్కో, ఆర్బీఐ వంటి సంస్థలతో పాటు ఇంటర్నెట్ దిగ్గజాలైన ఫేస్ బుక్, గూగుల్ వంటి బడా కంపెనీలు పుకార్ల ధాటికి దిగివచ్చి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియా కంపెనీలకు అతిపెద్ద మార్కెట్ లలో ఒకటైన భారత్ లో 16 కోట్ల మందికి పైనే వాట్సప్ వినియోగదారులుండగా, ఫేజ్ బుక్ లో 14 కోట్ల మంది, 2.2 కోట్ల మంది ట్విట్టర్ వినియోగదారులు ఉన్నారు. దీంతో ఎలాంటి వదంతి పుట్టినా క్షణాల్లో వ్యాపించి దేశం నలుమూలలకు చేరిపోతోంది. ఈ ఏడాది అలా వ్యాపించిన కొన్ని రూమర్లను అందరూ దాదాపు నిజమని నమ్మేశారు కూడా. ముఖ్యంగా అందులో కొన్నింటిని ప్రస్తావించుకుందాం.

1/11 Pages

1. ‘‘జనగణమన గీతం ప్రపంచంలోనే ఉత్తమ జాతీయ గీతంగా యునెస్కో ప్రకటించింది’’అని సోషల్ మీడియాలో వచ్చింది. అయితే, తాము ప్రత్యేకించి ఏదేశ గేయాన్ని ఉత్తమ గేయంగా ప్రకటించలేదని యునెస్కో వివరణ ఇచ్చింది.

English summary

Here are the lies that gone viral in All Over India and later there were known as lies and some of the representatives of that organisations gave clarity by saying that the news were rumors.