అసలు మానవత్వం ఉందా... మనుషులు చేసే పనేనా ఇది?

The famale baby in pond

12:07 PM ON 29th November, 2016 By Mirchi Vilas

The famale baby in pond

ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ఎగిరి కొందరు గంతేస్తుంటే, ఆడపిల్ల పుట్టబోతోందని తెల్సి కొందరు, పుట్టాక మరికొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. అసలే మగవాళ్లకు, ఆడవాళ్ళకు జనాభా నిష్పత్తిలో తేడా ఎక్కువగా రావడం వలన చాలామంది అబ్బాయిలు ముదురు బెండకాయలుగా మారినా పెళ్లిళ్లు అవ్వడం లేదు. అయినా ఆడపిల్లంటే అలుసు. అసలు గర్భంలో ఉన్నది, ఆడ మగా అనే విషయం చెప్పకూడదని చట్టం అమల్లో వుంది. అందుకే గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిషేదించారు. అయినా ఏదో రకంగా కడుపులో ఉండగానే తెలుసుకుంటున్నారు. ఫలితంగా దారుణానికి ఒడిగడుతున్నారు.

మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడూ.. మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్నవాడూ.. అని సినీగేయ రచయిత జాలాది ఉత్తినే రాయలేదని ఈ ఘటన చూస్తే అనిపించక మానదు. ప్రస్తుత సమాజంలో మనుషులు కోల్పోతున్న నైతిక విలువలకు, మనుషుల్లో పెరుగుతున్న క్రూరత్వాన్ని ఎత్తిచూపుతున్న ఈ పాటకు అచ్చంగా అద్దంపట్టేలా కర్నూలులో సోమవారం ఓ ఘటన చోటుచేసుకుంది. ఆడ శిశువైన కారణంగానా, మరే కారణమోగానీ పిండదశలోనే ఉన్న ఆడశిశువు నది ఒడ్డున తెలుతూ కనిపించింది. ఇది చూసిన వారి హృదయాలు ద్రవించాయి.

English summary

The famale baby in pond