షాకింగ్ న్యూస్: రూ.40వేలకు చేరిన బంగారం ధర!

The gold price was crossed to 40 thousand

11:49 AM ON 10th November, 2016 By Mirchi Vilas

The gold price was crossed to 40 thousand

బాప్ రే... 10 గ్రాముల పసిడి రూ.40వేలా?.. అని ఆశ్చర్యపోతున్నారా! అవును ఇది నిజమని చెప్పక తప్పదు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో నల్లధనం పోగేసిన అక్రమార్కులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆ నోట్లు చిత్తుకాగితాలే అని ప్రధాని మోడీయే స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో తమ వద్ద ఉన్న నల్లధనంతో కొందరు అక్రమంగా బంగారం కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీ సహా నగరంలోని పలు చోట్ల ఈ వ్యవహారం జోరుగా సాగుతోందట. తానూ ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్న రీతిలో నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, అక్రమార్కులు మరో రకంగా ఆలోచిస్తున్నారు.

తమ వద్ద ఎంత అక్రమార్జన ఉంటే అంత వదిలించుకునేందుకు చూస్తున్నారు. ముఖ్యంగా రూ.500, రూ.1000 నోట్లను ఎక్కడికక్కడ వదిలించుకునేందుకు చూస్తున్నారు. ఇందుకు బంగారం వ్యాపారులను సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు సుమారు 31వేలు ఉండగా, రూ.40 వేలు చెల్లించి కొనుగోలు చేసేందుకు వెనుకాడటం లేదని తెలుస్తోంది. భారీ మొత్తంలో డబ్బు చెల్లించడానికి వారు సిద్ధపడుతుండడంతో కొందరు వర్తకులు సైతం వారికి తగినట్లుగా రేటు పెంచేసి బంగారం అమ్ముతున్నారట. కొన్నిచోట్ల ఈ వ్యాపారం జోరుగా సాగుతోందని అంటున్నారు.

English summary

The gold price was crossed to 40 thousand