బతికి నట్టే బతికి, చివరకు అనంత లోకాల్లోకి ....

The great soldier Hanumanthappa passes away

06:41 PM ON 11th February, 2016 By Mirchi Vilas

The great soldier Hanumanthappa passes away

సియాచిన్‌లోని మంచు చరియల్లో చిక్కుకుపోయి ఆరు రోజుల తర్వాత కొన వూపిరితో బయటపడిన మృత్యుంజయుడు హనుమంతప్ప ఇంతలోనే ఈ లోకం వీడాడు. వీర సైనికుడి క్షేమం కోసం దేశవ్యాప్తంగా ఎన్ని ప్రార్థనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. భగవంతుడు కరుణించలేదు. గురువారం పరిస్థితి పూర్తిగా విషమించడంతో డిల్లీలోని ఆర్‌ఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీర సైనికుడు లాన్స్‌ నాయక్‌ హనుమంతప్ప కన్నుమూసాడు. మంచు చరియలనుంచి బతికి పట్టకట్టిన తర్వాత ఆసుపత్రిలో చేర్చడం, అప్పటి నుంచి డిల్లీలోని ఆర్‌ఆర్‌ ఆస్పత్రిలో అతనికి వైద్య చికిత్స అందిస్తూ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆసుపత్రికి వెళ్లి, అతను కోలుకోవాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలు చేస్తున్న ప్రార్ధనలు ఫలించాలని ఆన్నారు. అయితే కోమాలో ఉన్న హనుమంతప్ప ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. మూత్రపిండాలు, కాలేయం పని చేయడం మానేశాయి. దీంతో వైద్యులు అతనికి కృత్రిమ శ్వాస అందిస్తూ , డయాలసిస్‌ చేస్తూ వచ్చారు. మరోపక్క వూపిరితిత్తుల్లో న్యుమోనియా ఉన్నట్లు పరిశీలనలో తేలడంతో, హనుమంతప్ప ప్రాణాలు కాపాడేందుకు సైనిక వైద్యులతో పాటు, దిల్లీ ఎయిమ్స్‌ వైద్యుల బృందం శత విధాలా ప్రయత్నించింది. అయినా ఫలితం దక్కలేదు. వీర సైనికుడు హనుమంతప్ప మరణంతో దేశం కన్నీరుపెడుతోంది. యావత్‌ దేశ ప్రజలు ఆయనను బతికించమని చేసిన ప్రార్థనలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ప్రముఖులతో పాటు దేశమంతా అశ్రు నివాళులర్పిస్తోంది. వీర సైనికుడా అందుకో నీరాజనం అంటూ అతనికి దేశ ప్రజలు కన్నీటి వీడ్కోలు పలుకుతూ, అంజలి ఘటిస్తున్నారు.

English summary

Really sorry to inform everyone that LNk Hanamanthappa is no more. He breathed his last breath at 11:45 a.m. today