ఎవరెస్ట్ ఎత్తు లో తేడా వచ్చిందా?

The height of the Himalayan mountain is reduced?

10:58 AM ON 25th January, 2017 By Mirchi Vilas

The height of the Himalayan mountain is reduced?

హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎవరెస్ట్ శిఖరం 8,848 మీటర్లు(29,029 అడుగులు)తో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంగా కొనసాగుతోంద ని తెలుసు కదా. అయితే దీని ఎత్తులో తేడా వచ్చిందో ఏమోగానీ ఇప్పుడు ఎవరెస్టు ఎత్తునే మళ్ళీ కొలవబోతున్నారు. ఎవరెస్ట్ శిఖరం ఎత్తును తిరిగి కొలవనున్నారు. మరో మూడు నెలల్లో ఎవరెస్ట్ ఎత్తు ఎంత ఉందో నిర్ధారించనున్నారు. ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలవడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ ఐ) సిద్ధమైంది. ఈ బృహత్ కార్యక్రమాన్ని మరో రెండు నెలల్లో ప్రారంభించనున్నట్లు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఎత్తును కొలవడానికి సుమారు నెల రోజులు సమయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఇంతకీ ఎవరెస్టు కొలవడం ఎందుకంటే, నేపాల్ లో రెండేళ్ల క్రితం సంభవించిన తీవ్ర భూకంప నేపథ్యంలో ఎవరెస్ట్ ఎత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2015 ఏప్రిల్ 25న నేపాల్ లో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇంత తీవ్రభూకంపం నేపథ్యంలో భూగర్బంలోని టెక్టానిక్ పలకల్లో మార్పులు వచ్చి ఉంటాయని ఎవరెస్ట్ ఎత్తుపై ఇది ప్రభావం చూపి ఉంటుందని ఒక అంగుళం (2.54 సెంటీమీటర్ల) మేర తగ్గి ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు సందేహాలను వ్యక్తం చేశారు. కొంతకాలంగా శాస్త్రవేత్తల్లో ఇది చర్చనీయాంశంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ ఎత్తును కొలిచే అత్యంత ప్రధాన బాధ్యతను 250 ఏళ్ల చరిత్ర ఉన్న సర్వే ఆఫ్ ఇండియా చేపట్టనుంది. ఇప్పటికే ఇందుకు అవసరమైన కార్యాచరణను ప్రారంభించింది. అన్ని హంగులను సమకూర్చుకుని ఎవరెస్ట్ ఎత్తును కొలిచి అత్యంతం శాస్త్రీయంగా నిర్ధారించనుంది. సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఉంచిన నమూనా ఎవరెస్టు శిఖరం సందర్శకులను ఎంతో ఆకట్టుకుంది.

ఇది కూడా చూడండి : న్యూస్ పేపర్లపై ఈ చుక్కలు… ఎందుకో తెలుసా..?

ఇది కూడా చూడండి : రాజు గారి డైనింగ్ టేబుల్ పై రైలు ….వంటకాలన్నీ అందులోనేనట (వీడియో)

English summary

Scientist are estimating that height of the Himalayan mountain got reduced due to earth quakes in Nepal during the year 2015.So geologists are ready know about the present height of the mountain.