ఇక ఆన్ లైన్ లోనే ద ఇండిపెండెంట్‌

The Independent newspaper available online only

10:40 AM ON 13th February, 2016 By Mirchi Vilas

The Independent newspaper available online only

ఇప్పుడు అంతా డిజిటల్ యుగం. ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులోకి రావడంతో న్యూస్ పేపర్లు కొని చదివేవారి సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది. దీంతో విదేశాల్లో ఇప్పటికే చాలా పత్రికలు ఆన్‌లైన్‌కే పరిమితమైపోయాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ బ్రిటన్‌ దినపత్రిక ద ఇండిపెండెంట్‌ కూడా చేరింది. వచ్చే నెల నుంచి ఇండిపెండెంట్‌, ఇండిపెండెంట్‌ ఆన్‌ సండే రెండూ ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే పాఠకులకు అందుబాటులో ఉంటాయని ఈఎస్‌ఐ మీడియా సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యలో కూడా కోత పెట్టగా, ఆన్‌లైన్‌ ఎడిషన్‌ మాత్రం కొనసాగుతుందని తెలిపింది. అంతేకాకుండా ఐ పత్రికను జాన్‌స్టన్‌ ప్రెస్‌కు అమ్మివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. దినపత్రిక చివరి సంచిక మార్చి 26న వస్తుందని, ఇండిపెండెంట్‌ ఆన్‌ సండే మాత్రం మార్చి 20న వచ్చే ఎడిషన్‌తో ముగిస్తామని ఈఎస్‌ఐ తెలిపింది. 1986లో ప్రారంభమైన ఇండిపెండెంట్‌ అత్యధిక సర్క్యులేషన్‌ కలిగిన బ్రిటిష్‌ పత్రికగా పాఠకుల మన్ననలు అందుకుంది.

English summary