అలాంటి దుస్తుల వల్లే అలా జరిగింది కీచక పర్వంపై మరో బాబా సంచలన కామెంట్స్

The main reason for women harrasmnets is western clothes and culture commented by one more BABA

11:07 AM ON 10th January, 2017 By Mirchi Vilas

The main reason for women harrasmnets is western clothes and culture commented by one more BABA

న్యూ ఇయర్ సందర్బంగా బెంగుళూరులో & మహిళలపై లైంగిక వేధింపులు జరిగిన విషయం పెద్ద సంచలనం సృష్టించి, రచ్చ రచ్చ అయింది. ఈ & కీచకపర్వంపై ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అబూ అజ్మీ నోరు పారేసుకోగా.. ఇప్పుడు మరో బాబా కూడా ఆయనకు జత కలిశారు. అజ్మీ లాగే ఈయన కూడా తప్పంతా అమ్మాయిలదే అన్న తరహాలో కామెంట్ చేసి ఇప్పటికే రగులుతున్న వివాదాన్ని మరింత వివాదం చేసే ప్రయత్నం చేశారు. హిందూ మహాసభ అధ్యక్షుడైన స్వామీ ఓంజీ మహారాజ్ బెంగుళూరు కీచకపర్వంపై వివాదస్ప వ్యాఖ్యలు చేశారు. ఓ టీవి చానెల్ ప్రైమ్ టైమ్ లో 'షో' లోని ప్యానెల్ సభ్యుల్లో ఒకరైన ఆయన.. మహిళలు ధరిస్తున్న దుస్తుల వల్లే వారి మీద లైంగిక దాడులు జరుగుతున్నట్టుగా కామెంట్ చేశారు. దీంతో సహజంగానే ఈ వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.&

బురఖాలో ఉన్న స్త్రీలు సురక్షితంగా ఉంటున్నారని, పొట్టి స్కర్టులు వేసుకుంటున్నవారే ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారని ఓంజీ అన్నారు. అమ్మాయిలు నిండైన వస్త్రధారణలో ఉండాలని, అలా ఒంటినిండా బట్టలు కప్పుకోకపోతే, బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగా లైంగిక దాడులు జరుగుతాయని చెప్పారు. ఓవైపు సెలబ్రిటీలు, ప్రముఖులంతా ఈ ఘటనపై మండిపడుతున్న తరుణంలో ఓంజీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత రగిల్చేదిగా మారింది. దీనిపై నెటిజనులు మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంటే, కొందరు మాత్రం స్వామిజీ వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోస్తున్నారు. .

ఇది కూడా చూడండి: శ్రీరాముని కుమారులు కట్టించిన 4నగరాలు పాకిస్థాన్ లో ఉన్నాయా

ఇది కూడా చూడండి: ఖైదీ నం 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్

ఇది కూడా చూడండి: ఓంపురి మరణం వెనుక మోడీ హస్తం - ఓ ఛానల్ సంచలన కధనం

English summary

Recently held Bangalore issue on Girls harresment was again fired by one more BABA he commented that western culture of clothes is the main reason for crime on women.