బాప్ రే , అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయట.?

The Money Trees Of UK

11:29 AM ON 21st January, 2017 By Mirchi Vilas

The Money Trees Of UK

ఎలా ఉందేంటి? ఇక్కడ ఏమైనా డబ్బులు చెట్లకు కాస్తున్నాయా…? ఎంతంటే అంత ఇవ్వడానికి… ఎలా అంటే అలా ఖర్చు పెట్టడానికి..! అంటూ పలువురి నోట వింటూంటాం. ఎదో మాటవరసకు అలా అంటారు గానీ నిజానికి డబ్బులు చెట్లకు కాయవు కదా. ఎందుకంటే, డబ్బులు కష్టపడే సంపాదించాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మాత్రం చెట్లకు నిజంగానే డబ్బులు ఉన్నాయట. కానీ అవి కాయలు, పండ్లలా కాసినవి మాత్రం కావండి. మరి ఆ డబ్బులు చెట్లపైకి ఎలా వచ్చాయో తెలుసుకోవాలని ఉందా? అయితే ఓ సరి వివరాల్లోకి వెళదాం.

వుడ్ల్యాండ్ అనే ప్రదేశం అది. ఇంగ్లండ్లో ఉంది. ఇంతకీ వుడ్ ల్యాండ్ అంటే బూట్లు, పర్సులు అమ్మే బ్రాండెడ్ కంపెనీ అనుకున్నారా కానీ కాదు, నిజంగా అదొక ప్రాంతమే. అయితే కొన్ని వందల ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో ఉండే స్థానికులు అక్కడ ఉన్న అనేక చెట్లపై (వాటి కాండాలపై) నాణేలను పెట్టేవారట. అలా ఎందుకు చేసే వారు అంటే… ఆయా చెట్ల మీద దైవ సంబంధ ఆత్మలు ఉన్నాయని వారు నమ్మేవారు. అందుకే ఆ చెట్ల కాండాలపై నాణేలను గుచ్చేవారు. అలా చేస్తే ఆ ఆత్మలు శాంతించి వారు కోరిన కోరికలు తీరుస్తాయని వారి నమ్మకం. అందులో భాగంగానే వారు అలా చేసే వారు. అయితే ఒకప్పుడు వారు అలా చేసే సరికి వుడ్ ల్యాండ్ ప్రాంతంలో ఉన్న అన్ని చెట్లలో నాణేలు నిండిపోతూ వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లపై కొన్న వేల నాణేలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. దీంతో ఆ చెట్లను ఇప్పుడు మనీ ట్రీలు అంటారు.

అయితే ఒకప్పుడు పూర్వీకులు పాటించిన ఆ ఆచారం ఇప్పటికీ కొందరు పాటిస్తున్నారట. దీంతో ఆ చెట్లపై ఉండే నాణేల సంఖ్య మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ప్రతి ఏడాది క్రిస్మస్ రోజున ఈ చెట్లపై అనేక మంది నాణేలను పెట్టి తమ కోర్కెలు నెరవేరాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ చెట్లు ఇంకా మనీ ట్రీలుగానే పిలవబడుతున్నాయి. అయితే కొత్త వారికి మాత్రం వాటిని చూస్తే నిజంగానే డబ్బులు చెట్లకు కాసాయని అనిపిస్తుంది. మొత్తానికి ఈ వింత మనీ ట్రీలు గురించి చెబుతుంటే వెంటనే చూసెయ్యాలని ఉంది కదూ.

ఇవి కూడా చదవండి: మనల్ని ఎవరూ ఆపలేరన్న ట్రంప్

ఇవి కూడా చదవండి: సంపాధించిన డబ్బు పవర్ స్టార్ ఏం చేస్తున్నాడు - నేషనల్ మీడియా ఆసక్తికర కథనం.

English summary

There was some trees in UK in a place named Woodland that the trees with money. There was some tradition that they will treat that trees as the Tress of GOD.