ఈ ఏటి పదం రెఫ్యూజీస్‌

The most important word of the year is Refugees In Germany

05:48 PM ON 14th December, 2015 By Mirchi Vilas

The most important word of the year is Refugees In Germany

జర్మనీలో ఈ సంవత్సరం అత్యంత ముఖ్యమైన పదం రెఫ్యూజీస్‌(శరణార్థులు) అని వెల్లడైంది. ఈ ఏడాదంతా అక్కడ ఈ పదం గురించే ఎక్కువగా చర్చలు జరిగాయట. దీంతో సొసైటీ ఫర్‌ జర్మన్‌ లాంగ్వేజ్‌ ప్యానల్‌ సభ్యులు ఈ పదాన్ని ఈ ఏటి పదంగా గుర్తించారు. మొత్తం 2,500 పదాల్ని పరిశీలించిన మీదట ఈ పదమే జర్మన్‌ ప్రజలపై సామాజికంగా, రాజకీయంగా అత్యంత ప్రభావాన్ని చూపిన పదంగా తేల్చారు. దీంతో దీన్ని 2015 సంవత్సరపు పదంగా వారు ప్రకటించారు. రెండు, మూడు స్థానాల్లో జె సుస్‌ చార్లీ(ఐ యామ్‌ చార్లీ), గ్రెక్సిట్‌ అనే పదాల్ని వెల్లడించారు. ఫ్రాన్స్‌లోని చార్లీహెబ్డో కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి తర్వాత ఐ యామ్‌ చార్లీ అన్న పదం నినాదంగా మారింది. గ్రీస్‌ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో గ్రెక్సిట్‌ అన్న పదం వాడుకలోకి వచ్చింది.

English summary

The most important wored of the year in 2015 in germany was Refugees