ఆ గ్రామంలో అంతుచిక్కని మిస్టరీ

The mystery of the village that fell asleep

03:17 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

The mystery of the village that fell asleep

ప్రపంచంలో ఎన్నో అంతుచిక్కని వ్యాధులు వేదిస్తున్నాయి. అలాంటిదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యాధి కూడా. కజకిస్తాన్‌లోని బెరిజోవాకా అనే చిన్న గ్రామం లో ఏళ్ళ తరబడి ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. అక్కడ ఎందుకు అలా జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కలేదు. ఎవరికీ అంతుపట్టని ఓ భయంకర వ్యాధి ప్రజలను పట్టి పీడిస్తుంది. ఆ వ్యాధి ఏదో కాదు అతి నిద్రవ్యాధి. వారు నిద్రలోకి వెళ్ళారంటే మళ్ళీ ఎప్పుడు లేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి. వారు నిద్రపోయారో లేదా చనిపోయారో కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉంటారు.

ఈ నిద్ర వ్యాధి ఫలితంగా దాదాపు 1,500 మంది ప్రజలు బెరిజోవాకా గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ గ్రామాన్ని ఏదో శాపం పట్టి పీడిస్తుందని అపనమ్మకంలో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ వ్యాధి వల్ల వారికి మూర్చరావడం, కళ్లు మసకగా మారడం, కడుపులో భయంకరంగా తిప్పి కుప్పకూలి పోవడం వంటి లక్షణాలు వారిని పీడిస్తున్నాయి. ఈ జబ్బు పేరు 'స్లీపీహాలో' ఈ వ్యాధి ముఖ్యంగా యువతకు, చిన్నపిల్లలకి వస్తుంది.

చిన్న పిల్లలని తల్లులు చక్కగా తయారుచేసి స్కూల్‌కి పంపిస్తుంటే వారు స్కూల్‌ బెంచీలమీద గాఢ నిద్రలోకి వెళ్ళి పోతూడంతో వారికి ఏం చేయాలో తోచడం లేదు. ఉలుకు పలుకు లేకుండా రోజుల తరబడి అలాగే నిద్రలో ఉండిపోవడం తో ఏం చేయలేని పరిస్థితి. దీంతో వారంతా ఆ గ్రామానికి పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న అక్సాయి అనే గ్రామానికి తరిలి వెళ్ళిపోయారు. అయినా ఫలితం లేదు. వారంలో రెండు మూడు సార్లయినా పిల్లలు మత్తులోకి జారిపోతున్నారు.

వివరాల్లోకి వెళితే బెరిజోవాకా అనే గ్రామంలో విషవాయువుల ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఇలా జరుగుతుందని, కరచగనాక్ పెట్రోలియం ఆపరేటింగ్‌ పవర్‌ స్టేషన్‌ ఈ గ్రమానికి సమీపంలో ఉంది అందువల్ల అనేక విషవాయువులు విడుదల చేస్తుందని దాని ఫలితమే ఈ వ్యాధి అని అక్కడి ప్రజల వాదన. కాని అక్కడ పరీక్షలు నిర్వహించిన ప్రభత్వ అధికారులు మాత్రం అదేం లేదని చెప్పుకొస్తున్నారు. ఆ పిల్లల్ని వేధిస్తున్న మహమ్మారి ఏమిటో.. ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి మరి.

English summary

Scientists have discovered the cause of a strange sleeping sickness affecting of two villages in northern Kazakhstan. The sickness would affect both old and young, with children dropping off at school