అగ్రరాజ్య నేత స్టెప్పులు అదరహో(వీడియో)

The Obamas Dance To Thriller On Halloween

06:09 PM ON 2nd November, 2016 By Mirchi Vilas

The Obamas Dance To Thriller On Halloween

అవును అగ్ర రాజ్య అధిపతికి అయితే మాత్రం ఆయనా మనిషే కదా. కళాపోషణ ఉంటుంది కదా. అందుకే అమెరికా అధ్యక్షుడు ఒబామా, మిషెల్ దంపతులు చిందేశారు.. హ్యాలోవీన్ వేడుక సందర్భంగా అగ్రరాజ్య అధినేత స్థానికంగా నివాసం ఉండే చిన్నారులు, వారి కుటుంబాలతో ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా మైఖేల్ జాక్సన్ థ్రిల్లర్ కు ఒబామా దంపతులు వేసిన స్టెప్పులు అలరించాయి. తల్లిదండ్రులెవరూ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా పాటించే ఆరోగ్య, ఆహారపు చిట్కాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం లేదని ఒబామా చమత్కరించారు. పిల్లలు తమకిష్టమైన మిఠాయిలు తినాలని సూచించారు.

ఈ కార్యక్రమం అనంతరం అందరికీ ఒబామా, మిషెల్ లు మిఠాయిలు, స్నాక్స్ పంచిపెట్టారు. ఈ దంపతులిద్దరూ అందరికీ హ్యాలోవీన్ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు.

English summary

The Obamas Dance To Thriller On Halloween