పాతనోట్లు ఉంటే జైలుకే ...

The peolple having Old Notes Going to be jailed

11:04 AM ON 29th December, 2016 By Mirchi Vilas

The peolple having Old Notes  Going to be jailed

డిసెంబర్ 30వరకూ బ్యాంకు లలో రూ 500, రూ 1000 నోట్లు జమచేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పిన సంగతి తెల్సిందే. ఇప్పటికే చాలామంది జమచేయడం పూర్తయింది. అయితే మార్చి 31వరకూ రిజర్వ్ బాంక్ లో మార్పు చేసుకునే వెసులు బాటు వుంది. మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు కలిగి ఉన్నవారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం ఈ ఆర్డినెన్స్ కు రూపకల్పన చేసింది. దీని ద్వారా రద్దయిన నోట్లు మరిన్ని వెనక్కి వస్తాయని కేంద్రం భావిస్తోంది. ఈనేపధ్యంలో పెద్దనోట్ల రద్దు ఆర్డినెన్స్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

డిసెంబర్ 31 తర్వాత పాతనోట్లు ఉన్నవారు రిజర్వ్ బ్యాంకు కార్యాలయాల్లో కేవైసీ వివరాలు సమర్పించి మార్చి 31 వరకు నగదు మార్చుకునేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత పాతనోట్లు కలిగి ఉంటే మాత్రం వారిపై కఠినచర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అలాంటి వారికి కనీసం నాలుగేళ్ల వరకు జైలుశిక్ష అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. మొత్తానికి మరిన్ని కఠిన నిర్ణయాలు రాబోతున్నాయని అంటున్నారు. .

ఇది కూడా చదవండి: ఈ ఈ రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదట

ఇది కూడా చదవండి: కాశీ తాళ్లు వెనుక అసలు రహస్యం ఇదే

ఇది కూడా చదవండి: ఇలాంటి అమ్మాయిలతో పెళ్ళికి ఏ అబ్బాయి ఒప్పుకోడట

English summary

if anybody is having Old notes still with them. They are going to be jailed.