ఆ దేవుడు ఆకలి తీర్చాడు .. ఇది కథకాదు

The Real Story That Happened In Vijayawada

11:21 AM ON 19th January, 2017 By Mirchi Vilas

The Real Story That Happened In Vijayawada

అవును ఇది కథకాదు రియల్ స్టోరీయే. ఒకప్పుడు బెజవాడలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు సాగేవి. అందుకు సంబంధించిన మూవీ కూడా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసాడు. అది ఇటీవల విడుదలైంది కూడా. అది పక్కన పెడితే, విజయవాడలో వంగవీటి మోహనరంగా హత్య జరిగిన సమయంలో ఆంధ్రలో కర్ఫ్యూ సాగింది … ఇది ఆనాటి ఘటన. .ఒక పేద ముసలావిడ పది ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ తలిదండ్రులు లేని తన మనవడి ఆకలితీర్చేది. ఆ కర్ఫ్యూ వల్ల ఇంటితలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితుల్లో ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొరపెట్టుకోవడానికి మోకరిల్లి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనలో ఆవిడ దేవునితో “ప్రభువా!! ఏలీయాకి కాకితో ఆహారాన్ని సమకూర్చావు,.అలాగే నా మనవడి ఆకలి తీర్చగలవని ప్రాధేయ పడుతున్నాను”అన్నది.

ఆ మాటవిన్న తన మనవడు కాకి ఆహారాన్ని తెస్తుందని నమ్మి ,కాకి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి లేవని వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు.కిటికీ పక్కనే కాపాలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపుమీద కొట్టి లోపలికి తొంగిచూశాడు.లోపల ఆ పసిపిల్లవాడు బిక్కమోహం వేసుకుని అతనివంక బెదురుగా చూస్తుంటే..ఆ పోలీసు “ఏరా? తలుపెందుకు తీశావ్ ?”అన్నాడు. ఆ పిల్లవాడు “మా మామ్మ దేవునికి ప్రార్థన చేసింది.దేవుడు కాకితో ఆహారం పంపుతాడని అంటుంది” అన్నాడు. అప్పుడా పోలీసు లోపల గదిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న ముసలావిడని చూసి ఆ పిల్లవాడితో “ఆకలివేస్తుందా “అని అడిగి..”మీ మామ్మ చెప్పిన కాకిని నేనే..నువ్వు కిటికీ తలుపులు వేసుకుని లోపలే ఉండు.నేను మళ్ళీ వచ్చి తలుపుకొట్టినప్పుడు తియ్యి” అని చెప్పాడు.అతను ఒక మూసిఉన్న పచారికొట్టు తీయించి పప్పులు,ఉప్పులు,బియ్యం అన్నీ తీసుకుని ఆ రోజుకి తనకిచ్చిన భోజనాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లవాడి ఇంటికిటికీ దగ్గరికి వెళ్ళి తలుపుకొట్టి అందించాడు. ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు “ఖాకీ” ద్వారా ఆకలి తీర్చాడు.

ఇందులో… ఒకరిది ప్రార్థన ( నానమ్మ ), ఇంకొకరిది విశ్వాసం( మనవడిది).. మరొకరిది ప్రేమ పూరిత సహాయం( పోలీస్ ది).

దేవుడు ప్రతిచోటా ఉండకపోవొచ్చు కానీ….. నిస్వార్థంలో, న్యాయమైన రీతిలో నడిచే వారి ఆపదల ను ఏదో ఓ రూపంలో తీరుస్తాడు. అందుకే సర్వాంతర్యామి అని దేవుడిని అంటారు. ఇలాంటి ఘటనలు అక్కడక్కడా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి.

ఇవి కూడా చదవండి: ఆమిర్ ఖాన్ ఫోర్న్ టేప్ లీకయింది

ఇవి కూడా చదవండి: ఆమెది పిచ్చెక్కి కోరిక ... ఇంతకీ ఏమిటో తెలిస్తే షాకవుతారు

English summary

This was not the story and this was the real incident that happened in Vijayawada in past days. The small boy was full of hunger and the people of Vijayawada was not able to come outside because of the karfyu in Viajayawada at that time.