బన్నీ టూర్ల వెనక...ఆ..సందడేనా

The Reason Behind Allu Arjun Tours

03:23 PM ON 6th June, 2016 By Mirchi Vilas

The Reason Behind Allu Arjun Tours

సెలబ్రిటీలు ఏం చిసినా దానికో కారణం తప్పని సరిగా ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ వరస టూర్ల వెనుక కూడా ఓ బలమైన కారణం ఉందని అంటున్నారు. అదే నండీ అల్లు వారి ఇంట మరో వంశాంకురం అట . అదేనండి బన్నీ మళ్లీ తండ్రి కాబోతున్నాడట. ఈ శుభవార్త నిజమేనా అంటే అవుననే ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. బన్నీ ఈ మధ్య ఎడాపెడా ఫ్యామిలీతో కలిసి టూర్లు వేయడంతో ఫ్యాన్స్ కూడా నిజమేనని నమ్ముతున్నారు. నార్మల్ గా ఒక సినిమా చేసిన తర్వాత హీరోలు ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్ వేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఈ మధ్యకాలంలోబన్నీ రెండుసార్లు టూర్ వేయడంతో సినీ అభిమానులు ఆదిశగా చర్చించుకోవడం మొదలుపెట్టారు.

రీసెంట్ గా ఫ్యామిలీతో కలిసి గత నెల కాశ్మీర్ కి అల్లుఅర్జున్ వెళ్లాడు. ఈ టూర్ నుంచి వచ్చిన తర్వాత బన్నీ కొత్త ప్రాజెక్ట్ మొదలవుతుందని చాలామంది అనుకున్నా, ఈలోగా టర్కీ వెళ్లేందుకు వీసా తీసుకున్నాడు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం న్యూప్రాజెక్ట్ మూవీ గురించేనని అనుకున్నారు. లేటెస్ట్ గా బన్నీ తన వైఫ్ తోవున్న పిక్ చూసినవాళ్లు మాత్రం, బన్నీ మళ్లీ తండ్రి కాబోతున్న నేపథ్యంలోనే ఇలా టూర్లు వేస్తున్నాడని అంటున్నారు. ఇదే నిజమైతే అల్లు వారి ఇంట మళ్లీ సందడేనని చెప్పక తప్పదు. ఈ విషయమై అటు సోషల్ మీడియాలోనూ చర్చ సాగిపోతోంది. ఇక తీపి కబురు రావడమే తరువాయా...

ఇవి కూడా చదవండి:ఎడమొగం ... పెడమొగం ... అయినా మళ్లీ జోడీ కట్టారు...

ఇవి కూడా చదవండి:ఆ సీరియల్ చూస్తే సెక్స్ లో పాల్గొనడం ఖాయమట!

English summary

Recently Stylish Star Allu Arjun was going to continuous tours with his wife and now all were thinking that he was going to become dad again and that's the reason behind his continuous tours.