చంద్రబాబుని చూసి దేవాన్ష్‌ ఏడ్చాడా ?

The Reason Behind Devansh Cried By Seeing Chandrababu Naidu

01:13 PM ON 29th April, 2016 By Mirchi Vilas

The Reason Behind Devansh Cried By Seeing Chandrababu Naidu

ఏపీ సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ ఈ మధ్య అదేపనిగా గుక్కపట్టి ఏడ్చాడట.. ఎందుకంటే తన తాతను చూసట. చంద్రబాబుని చూడగానే దేవాన్ష్‌ కి అంత గుక్క పెట్టి ఏడవడం వెనుక సెంటిమెంట్ వుంది. అదేమంటే వివరాల్లోకి వెళ్ళాలి ... తాతను చూసి ఎవరో అనుకుని దేవాన్ష్‌ ఏడ్చినట్టు లోకేష్ చెబుతున్నారు. ఆ మధ్య టీడీపీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి కొడుకు పెళ్లి సందర్భంగా చంద్రబాబు హైదరాబాద్ వచ్చినప్పుడు వెడ్డింగ్ రిసెప్షన్ లో జరిగిన సంఘటన ఇదట. తన మనవడ్ని బాబు ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకోబోగా తన కొడుకు ఏడ్చిన వైనాన్ని లోకేష్ గుర్తు చేశారు. తన తండ్రి చంద్రబాబు రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటారని, హైదరాబాద్, విజయవాడ మధ్య తరచూ తిరగడమే కాక, రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలను విజిట్ చేస్తుంటారని, మనవడితో ఆడుకోవడానికి ఆయనకు టైం లేదని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:ఇంట్లో పొయ్యి వెలిగించారో జైలు శిక్ష తప్పదు

విశాఖలో ఇటీవల లోకేష్. మాట్లాడుతూ, తాత విజయవాడలో.. మనవడు హైదరాబాద్ లో..ఇదీ మా కుటుంబ పరిస్థితి' అంటూ ఎంతో ఇదై పోయారు. అయితే లోకేష్ బాబు సెంటిమెంటు సిల్లీగా ఉందనే కామెంట్లు పడిపోతున్నాయి. తన తండ్రి చంద్రబాబు రాష్ట్రం కోసం త్యాగాలు చేస్తున్నారని, మనవడితో ఆడుకోవడాన్ని మిస్ అవుతున్నారని లోకేష్ చేసిన వ్యాఖ్యలకు రాజకీయ సెంటిమెంట్ అంటూ కొన్ని సైట్లు జోడించడం విశేషం. సాధారణంగా రాజకీయ నేత అయిన ప్రతివ్యక్తీ తన ఫ్యామిలీకి తరచూ దూరంగా ఉండడం సహజం.

ఇవి కూడా చదవండి:రామ్ చరణ్ తేజ్ ప్రొడక్షన్ హౌస్ లోగో ఇదే

ఇవి కూడా చదవండి:వడదెబ్బ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu's Grand Son Devansh was cried by seeing Nara Chandra Babu Naidu. This was said by Nara Lokesh in Vishakapatnam. He said that Chandrababu even not having time to play with his Grand Son and he was working for the sake of Andhra Pradesh.