ఎన్టీఆర్ లావెక్కడానికి కారణం అదా 

The Reason Behind NTR Become Fat

11:50 AM ON 25th January, 2016 By Mirchi Vilas

The Reason Behind NTR Become Fat

ఆపరేషన్ చేసి , కొవ్వు తీయిన్చుకోక మునుపు ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవాడు. అలా లావుగా ఉండడానికి గల కారణం ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పేసాడు. నేతి పదార్ధాలు ఎక్కువగా వాడడం వలననే అలా లావెక్కిపోయాడట. అదెలాగో ఎన్టీఆర్ మాటల్లో 'తాతగారు నన్ను గౌరవ సూచకంగా అండీ అనేవారు.అంతేకాదు నన్ను ఆయన ‘తాతా..’ అని పిలిచేవారు. ఇక నాకు నెయ్యి పడేది కాదు. మా అమ్మ నేయి కలిపిన ముద్ద నోట్లో పెడితే కక్కేసేవాడ్ని. తాతగారు మాత్రం ఇడ్లీని నేతిలో ముంచి, ఊ.. ‘తినండి’ అనేవారు. నాకు తప్పేది కాదు. ఆవిధంగా తాతయ్య భోజన అలవాట్లన్నీ నాకొచ్చేశాయ్‌. దాంతో రోజు రోజుకీ లావైపోయేవాడ్ని. అసలే నేను కాస్త బొద్దుగా ఉండేవాడ్ని. తాతగారు ఇంకా బొద్దుగా మార్చేశారు'. ఇదండీ ఎన్టీఆర్ లావు వెనుక కధ. మరి తాతను వదిలి ఓ క్షణం ఉండేవాడు కాదట జూనియర్. అలాగే తాత కూడా ఎన్టీఆర్ ని వదిలి ఉండేవారు కాదట.

English summary

Junior NTR says that the reason behind that he became that much fat at the starting of his carrier.He says that Senior NTR has put him Ghee items more and his mother was also done the same thing