సెల్వం అర్ధరాత్రి ప్రమాణం వెనుక తెరవెనుక శక్తి ఇతడేనా?

The Reason Behind Panneerselvam Take Oath On Mid Night

11:06 AM ON 8th December, 2016 By Mirchi Vilas

The Reason Behind Panneerselvam Take Oath On Mid Night

తమిళనాట శక్తివంతురాలైన నేత, విప్లవ నాయకి అమ్మ’ అనంత లోకాలకు వెళ్ళిపోవడంతో ఆమె నేతృత్వంలో ఎదిగిన ఏఐఏడీఎంకే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న అందరికీ వస్తోంది. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. అయితే పార్టీలో కోటరీ అంటూ ఒకటి ఉందట. ఎంజీ రామచంద్రన్ సజీవంగా ఉన్నపుడే, అమ్మ నెచ్చెలి శశికళ భర్త నటరాజన్ అన్నాడీఎంకేలో చేరాడు. మన్నార్ గుడి మాఫియా’ అని పేరున్న కోటరీలో నటరాజన్ కూడా ఓ సభ్యుడు. అయితే ఈ కోటరీని జయలలిత దూరంగా ఉంచారు. 2011లో పొయెస్ గార్డెన్ నుంచి కూడా తరిమేశారు. శశికళను కూడా జయలలిత కొన్నాళ్ళు దూరంగా ఉంచారు. అయితే శశికళ తన కుటుంబాన్ని వదిలేసి రావడంతో మళ్ళీ జయలలిత చేరదీశారు. అమ్మ’ మరణం తర్వాత పార్థివ దేహానికి అంతిమ సంస్కారాల్లో శశికళ కుటుంబీకులు పాల్గొన్నారు. దీంతో నటరాజన్ మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు.

ముఖ్యంగా జయలలిత తుది శ్వాస విడవడానికి ముందు పార్టీ ఎమ్మెల్యేలతో నటరాజన్ సమావేశమైనట్లు సమాచారం. ఇక పన్నీర్ సెల్వం అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ ప్రమాణ స్వీకారం చేయడం వెనుక బలమైన శక్తిగా నటరాజన్ వ్యవహరించారంటున్నారు. ఎంజీఆర్ వారసురాలిగా జయలలితను ప్రకటించడంలో తాను కూడా పాత్రధారినేనని నటరాజన్ చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. జయలలిత 25 ఏళ్ళ పాటు పార్టీని నడిపించగలరని తాము భావించామని, అయితే ఆమె 28 ఏళ్ళ పాటు పార్టీని ఏకతాటిపై నడిపించి, ఎంజీఆర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళారని ఆయన అంటున్నారు. పార్టీలో శూన్యత లేదన్నారు. సామాన్యుడు అయినా పార్టీని ముందుకు తీసుకెళ్ళవచ్చునన్నారు. ఎంజీఆర్, అమ్మ’ ఆకర్షణ ఉన్నంత కాలం ఏఐఏడీఎంకే కొనసాగుతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమ్మ’కు నివాళులర్పించేందుకు వచ్చినపుడు శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చడం కనిపించిందని, శశికళను అన్నాడీఎంకేలో అధికార కేంద్రంగా చేయాలని బీజేపీ భావిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : నోట్ల రద్ద యవ్వారంపై ...అద్వానీకి కోపమొ చ్చింది

ఇవి కూడా చదవండి : స్మార్ట్ ఫోన్ లేకున్నా జియో ... రిలయన్స్ బంపరాఫర్

English summary

AIDMK Party President Jaya Lalitha was died recently and MLA PanneerSelvam was become take oath as the New Chief Minister of Tamilnadu at the Mid Night. Jaya's Close Friend Sasikala's Husband Natarajan was the reason behind Panneer Selvam's OATH as a New CM of Taminadu.