అన్నయ్య మీద రివేంజ్ తీర్చుకోడానికే  పిలిచాడా

The Reason Behind Pawan Attended Chiranjeevi For Sardaar Audio Function

12:11 PM ON 21st March, 2016 By Mirchi Vilas

The Reason Behind Pawan Attended Chiranjeevi For Sardaar Audio Function

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమా ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ నోవాటెల్‌ హోటల్‌లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా విచ్చేయడం వెనుక స్వయంగా పవన్ వత్తిడి వుంది. ఎందుకంటే, దీనికో లాజిక్ వుందట. అదేమిటో పవన్ మాటల్లో వ్యక్తమయింది. 'నేను జానీ సినిమా చేసినప్పుడు అన్నయ్య చూసి, ఇంకా కష్టపడి వుంటే, బాగుందేదన్నాడు. ఎందుకంటే ఆ సినిమా ప్లాప్ అయింది. ఇది ఒప్పుకుని తీరాలి.

అయితే ఆనాటి పరిస్థితుల్లో ఆసినిమా చేయాల్సి వచ్చింది. కష్టపడ్డాను కూడా ... కానీ రిజల్ట్ వేరేలా వచ్చింది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ ఎంతో కష్టపడి చేశా. దాదాపు రెండున్నరేళ్ళు పట్టింది. ఈ సినిమా చాలా బాగుంటుందన్న నమ్మకం వుంది. అన్నయ్య ను అందుకే ఈ ఫంక్షన్ కి పిలిచా' అని పవన్ చెప్పాడు. ఇక ఈ సినిమా అద్బుతంగా ఆడాలని, ఆడుతుందని , హండ్రెడ్ డేస్ ఫంక్షన్లు తగ్గిపోయిన నేపధ్యంలో సర్దార్ వంద రోజుల వేడుక జరుపుకోవాలని మెగాస్టార్ ఆకాంక్షిస్తూ, వందరోజుల వేడుకకు కూడా తానూ వస్తానని చెప్పాడు. మొత్తానికి అరమరికలు లేకుండా అన్నదమ్ముల అనుబంధాన్ని మరోసారి చాటారు చిరు - పవన్ ...

చరణ్ కి క్లాసు పీకిన పవన్

ఆ పార్టీ తరఫున పోటి చెయ్యనున్న విశాల్

సర్దార్ వేడుకలో హైలెట్స్ ....

నీకు ఆ సత్తా ఉందని నాకు తెలుసు... చిరంజీవి

English summary

Power Star Pawan Kalyan's Sardaar Gabbar Singh Audio Launch was conducted yesterday at Hyderabad and Pawan Kalyan invited his Brother Mega Star Chiranjeevi as a chief guest to that audio function. Pawan Kalyan talked about his Johnny Movie failure. Pawan Kalyan Said that during Johnny movie failure Chiranjeevi Suggested Pawan Kalyan that Johnny movie could be do better.