కమీడియన్‌గా మానేసింది అందుకే.  

The Reason Behind Sunil Rejected Comedian Roles

05:37 PM ON 20th February, 2016 By Mirchi Vilas

The Reason Behind Sunil Rejected Comedian Roles

సైడ్‌ డ్యాన్సర్‌ నుండి కమీడియన్‌గా,కమీడియన్‌ నుండి కామెడీ హీరో నుండి మాస్‌ హీరోగా ప్రమెట్‌ అయిన నటుడు 'సునీల్‌'.అయితే ఇప్పటికి సునీల్‌ కమీడియన్‌ గా చేస్తే చూడాలని ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే సునీల్‌ చెప్పే డైలాగులు,సునీల్‌ ఇచ్చే హావాభావాలు ,అతని టైమింగ్‌ ప్రేక్షకుల్ని నవ్వుల పువ్వులు పూయించాయి.ఒక ముక్కలో చెప్పాలంటే సునీల్‌ ఉన్నంత కాలం అభిమానులు బ్రహ్మానందాన్ని కూడా మర్చిపోయారంటే సునీల్‌ ఏ స్ధాయి కమీడియన్‌ ఓ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే సునీల్‌ ఇప్పుడు కమీడియన్‌ గా మానేసి హీరోగానే చేస్తున్నాడు.సునీల్‌ తాజాగా నటించిన 'కృష్ణాష్టమి' చిత్రం నిన్న (ఫిబ్రవరి 19) విడుదల సందర్భంగా సునీల్‌ ప్రెస్‌ మీట్‌లో తాను కమీడియన్‌గా ఎందుకు మానేశాడో చెప్పాడు.అసలు కమీడియన్‌గా చెయ్యడం చాలా కష్టం,ఎందుకంటే ఒకేసారి మూడు నాలుగు సినిమాల్లో నటించాల్సి వచ్చినప్పుడు డేట్స్‌ అడ్జెస్ట్‌ చెయ్యడంలో చాలా కష్టం అనిపించేది.అసలు ఇంటికి కూడా సరిగ్గా వెళ్ళే వాడిని కాదు.ఒక షూటింగ్‌ తరువాత షూటింగ్‌ అని చెప్పి ఇలా తిరుగుతూనే ఉండేవాడిని.అన్నిటికంటే పెద్ద కష్టమేమిటంటే ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాల్లో ఒకేసారి నటిస్తునప్పుడు చాలా కష్టంగా ఉండేది.ఆ రెండు సినిమాలు మాకు అనుకూలంగా ఉండేలా షెడ్యుల్‌ వేసుకుంటారు.ఒక చోట షూటింగ్‌ జరుగుతున్నప్పుడు అక్కడ సీన్‌ పూర్తవ్వకుండా పంపరు.ఇంకో షూటింగ్‌ కి టైం అయిపోతా ఉంటుంది.ఇటు పక్కా పెద్ద హీరో అటు పక్కా పెద్ద హీరో దీనితో ఎవరినీ కాదనలేం.అలాంటి సమయాల్లో చాలా ఇబ్బంది అనిపించేది.అందుకే కమీడియన్‌గా మానేశా అని తన కష్టం గురించి చెప్పాడు సునీల్‌.

English summary

Comedian who turned as Hero Sunil has got good fame by his comedy roles.Later He Turned as hero by the movie Andala Ramudu.Sunil says the reason behind he was not doing Hero roles.He says that when he was as a comedian he was very busy and he didn't have much time to spend with his family.His recent film Krishnastami was released and it was going with hit talk.