వర్మ కు ఆటంకంగా మారిన పూరి

The Reason For Attack Movie Not Yet Released

05:34 PM ON 15th March, 2016 By Mirchi Vilas

The Reason For Attack Movie Not Yet Released

అవును మీరు విన్నది నిజమే వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం ఏదో విధంగా వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ కు పూరి జగన్నాధ్ ఆటంకంగా మారాడు . మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ , ప్రకాష్ రాజ్ , జగపతి బాబు ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం " అటాక్ " . ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యింది కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదల కాలేదు. విడుదల అవుతుంది అవుతుందని చెప్పడం తప్ప ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం ఈ చిత్ర యూనిట్ చెప్పలేకపోతుంది. ఈ సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం పూరి జగన్నాధ్ అని ఫిలిం నగర్ లో టాక్.

పూరి జగన్నాధ్ కు ఈ సినిమాకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా ..??...వివరాల్లోకి వెళ్తే అటాక్ సినిమాకు నిర్మాత అయిన సి.కళ్యాణ్ పూరి జగన్నాధ్ తో కలిసి జ్యోతి లక్ష్మి ,లోఫర్ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలలో జ్యోతి లక్ష్మి సినిమా హిట్ అవ్వగా , లోఫర్ సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. దీంతో సి.కళ్యాణ్ తో పాటు ఆ సినిమాను కొన్న బయ్యర్లు కుడా దారుణమైన నష్టాలను చూడాల్సి వచ్చింది. దీంతో లోఫర్ తెచ్చిన నష్టాల లెక్కలు తేలితే తప్ప "అటాక్ " సినిమాని కొనడానికి ఎవరు ముందుకు రావకపోవడంతో వర్మ అటాక్ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇదండి అసలు సంగతి.. ఇలా వర్మ కు పూరి ఆటంకంగా మారాడు.

English summary

Most Controversial Director Ram Gopal Varma made a film named "Attack" with the stars like Manchu Manoj,Prakash Raj and Jagapati Babu.This movie has to be released early but still now this movie was not released bacause of puri jagannagh.