శింబుని అందుకే రిజెక్ట్ చేశా

The Reason Why Hansika Rejected Simbu Movie

11:04 AM ON 4th April, 2016 By Mirchi Vilas

The Reason Why Hansika Rejected Simbu Movie

చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరోయిన్‌గా ఎదిగినవారు చాలామందే ఉన్నా, విజయాన్ని అందుకున్నతక్కువ మందిలో హన్సిక పేరు ముందు వరుసలో వుంటుంది. హీరోయిన్‌గా ఎంతో మంచి పేరునీ అంతకు మించి సినీ పరిశ్రమలో మంచి మనసున్న అమ్మాయిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్‌ హన్సిక మాత్రమే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమై, ప్రస్తుతం కోలీవుడ్‌లోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది.

ఇవి కుడా చదవండి :

ఐటెం సాంగ్ కీ రెడీ

సన్నితో నటించాలని ఉంది

తమిళంలో ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరికొన్ని కథలు కూడా వింది. తమిళ సినిమాలతో బిజీగా ఉండడం, మనసుకు నచ్చిన పాత్రలు రాకపోవడం వల్ల తెలుగులో సినిమాలు తక్కువగానే చేయవలసి వస్తోందని అంటోంది. 'అయితే, మంచి ప్రాజెక్టు వస్తే తప్పకుండా చేస్తా. అలాంటి సినిమా కోసం నేనూ ఎదురు చూస్తున్నా' అని ఈ అమ్మడు చెబుతోంది. తెలుగులో ఎక్కువగా హీరోయిన్‌ను గ్లామర్‌కే పరిమితం చేస్తారని, నటనకు పెద్దగా అవకాశం ఉండదని హన్సిక చెబుతూ, కోలీవుడ్‌లో డిఫరెంట్‌ సబ్జెక్టులు చేసే అవకాశం ఉందని అంటోంది. ' గ్లామర్‌ పాత్రలు ఇప్పటికే చాలా చేశా. ఒకే రకం పాత్రలు బోర్‌ కొట్టి నేనే కొన్ని సినిమాలు వదులుకున్నా' అని చెబుతోంది. ఇక కొందరు హీరోలతో చేయని చెప్పడం గురించి ప్రస్తావిస్తే, 'అదేం లేదు. శింబు సినిమా మాత్రమే రిజెక్ట్‌ చేశా. దానికి నా కారణాలు నాకున్నాయి. అవి అందరితో పంచుకోవలసిన అవసరం లేదు' అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ప్రేమా , పెళ్ళి గురించి అడిగితే, ఇప్పుడప్పుడే ఆ ఆలోచన లేదు. నాకు పెళ్ళి ఎప్పుడు చేయాలో మా మదర్‌కి బాగా తెలుసు. ఆ విషయాలు ఆవిడే చూసు కుంటుంది' అంటూ చెప్పే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ , త్వరలో ఓ వృద్దాశ్రమం కూడా పెట్టాలనుకుంటోందట. మరి బెస్టాఫ్ లాక్ చెప్పేదామా....

ఇవి కుడా చదవండి :

ప్రియాంక చోప్రా ఆత్యహత్యాయత్నం

ఎటిఎం నే ఎత్తుకెళ్ళి పోయారట

'ఊపిరి' నిర్మాతలు మోసం చేసారు:రాజా రవీంద్ర

English summary

Heroine Hansika says that she was not acting in Telugu because she was not getting good offers in Tollywood.She also said the reason why she rejected Simbhu Movie.She says that She had her own reasonss to reject that Movie.