రజినీ-కమల్ లు ఎందుకు కలిసి నటించరో తెలుసా!

The Reason Why Kamal Haasan And Rajinikanth Do Not Act Together

02:55 PM ON 15th July, 2016 By Mirchi Vilas

The Reason Why Kamal Haasan And Rajinikanth Do Not Act Together

ఇండియా లో సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ లకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో వేరే చెప్పనక్కర్లేదు. కేవలం భారత దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వీరిద్దరికి అనేక దేశాలలో వీరిద్దరికి అనేక మంది అభిమానులున్నారు. భారత్ లో మరే సినీ హీరోలకు లేనంత క్రేజ్ ఈ ఇద్దరు హీరోలకు ఉందంటే వీరికున్న అభిమాన గళం ఎంతో ఏంటో యిట్టే అర్థం అవుతుంది. విబ్భినమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించే వీరు ఇటీవల కలిసి నటించిన సందర్భాలు లేవు. వీరిద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే ఇక అభిమానులకు పండుగే. కమల్ హాసన్ రజినీకాంత్ లు ఇద్దరు ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలని ఎంతో మంది అభిమానులు కోరుకుంటారు. కానీ వీరిద్దరూ ఇటీవల కలిసి నటించకపోవడంతో కమల్ రజినీ ల మధ్య ఏవో విభేదాలున్నాయని, అందుకే వీరిద్దరూ కలిసి నటించడం లేదని వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఈ వాదనలకు ఫుల్ స్టాప్ పెడుతూ కమల్ హాసన్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో కమల హాసన్ ను సదరు యాంకర్ ఇదే విషయమై అడగగా, కమల్ హాసన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. కమల్ హాసన్ స్పందిస్తూ రజినీకాంత్ తాను ఎప్పటి నుండో చాలా మంచి స్నేహితులమని, తమ పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, అవన్నీ కేవలం కల్పితం అని కమల్ తెలిపాడు. తమను వెండితెరకు పరిచయం చేసిన వ్యక్తి అలనాటి లెజండరీ డైరెక్టర్ "బాలచందర్"అని కమల్ తెలిపాడు. "రోబో" సినిమాను చెయ్యాల్సిందిగా డైరెక్టర్ శంకర్ మొదట కమల్ ను సంప్రదించాడట అయితే అప్పటికే కమల్ తన సినిమాలతో బిజీ గా ఉండడంతో తిరస్కరించాడట. దీంతో శంకర్ ఆ తరువాత రజినీకాంత్ ను సంప్రదించగా రజినీ ఒప్పుకోవడం, రజినీకాంత్ తో సినిమా తెరకెక్కించడం, సినిమా సూపర్ హిట్ కావడం చక చకా జరిగిపోయాయి.

అంతేకాక రజినీకాంత్ హీరో గా రోబో సినిమాకు సీక్వల్ గా రూపొందుతున్న "రోబో-2.0" సినిమాలో విలన్ గా నటించమని డైరెక్టర్ శంకర్ బాలీవుడ్ హీరోలు షారుఖ్, సల్మాన్ ,అమీర్ ఖాన్ లను సంప్రదించాడట అయితే చివరకు అక్షయ్ కుమార్ ఎంపిక చేశారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వారందరికంటే ముందు డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ ను సంప్రదించాడట. అయితే ఇందుకు కూడా కమల్ హాసన్ తిరస్కరించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే "కమల్ కోసం, రజినీకాంత్ లు ఒకే సినిమాలో నటించాలనుకుంటే కమల్ రజినీ లలో ఎవరో ఒకరు ఆ సినిమాను ప్రొడ్యూస్ చెయ్యాలని వారిద్దరూ ఎప్పుడో ఒక నిబ్బందన పెట్టున్నారట". అందుకే కమల్ హాసన్ రజినీకాంత్ లు ఇద్దరు ఒక సినిమాలో ఇటీవల నటించలేదు. ఇదండీ కమల హాసన్ - రజినీకాంత్ లు ఇద్దరు కలిసి నటించకపోవడానికి గల ప్రాధాన కారణం.

చివరగా కమల్ - రజినీ లు ఇద్దరు కలిసి నటించిన సినిమాలను స్లైడ్ షో లో చూదాం.......

1/8 Pages

అంతులేని కథ

English summary

Indian Stars Universal Star Kamal Haasan and Super Star Rajinikanth has huge Fan Following in India and Overseas also. Recent Days they two did not act together in a film and recently Kamal Haasan said the answer to that question and Kamal and Rajini decided to act together when they one of them have to produce that movie. Kamal Haasan reveled that Director Shankar Approached him For Robo Movie Before Rajinikanth.