విష్ణుమూర్తి నారాయణుడు ఇలా అయ్యాడు

The Reason Why Lord Vishnu Called As Narayana

12:15 PM ON 12th December, 2016 By Mirchi Vilas

The Reason Why Lord Vishnu Called As Narayana

బ్రహ్మ, విష్ణు,మేహేశ్వర్లను త్రిమూర్తులు అంటాం కూడా. అయితే ఇందులో శ్రీమహావిష్ణువు లోక కల్యాణం కోసం 10 అవతారాలను ధరించాడు. అందులో కొన్ని అవతారాలతో జనావళికి మేలు చేయగా, మరికొన్ని అవతారాల్లో రాక్షస సంహారం చేసి జనాలను, దేవతలను రక్షించాడు. తాను ధరించిన ఒక్కో అవతారం గురించి అనేక కథలు కూడా ఉన్నాయి. అయితే శ్రీమహావిష్ణువు ఆయన ధరించిన అవతారాల్లోనే కాదు, అనేక ఇతర వేరే పేర్లతో కూడా భక్తులచే పొగడ్తలు, కీర్తనలు, ప్రశంసలు అందుకుంటున్నాడు. అందులో ఒక పేరే నారాయణుడు. ఇంతకీ ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం

1/4 Pages

ప్రాణికోటి మనుగడకు నీరు అత్యంత ఆవశ్యకం. నీరు లేకపోతే మనం లేము. అయితే నారాయణుడు అన్న పేరులో నారము అంటే నీరు అనే అర్థం వస్తుంది. అదేవిధంగా ఆయణుడు అంటే దారి చూపే వాడు అని అర్థం వస్తుంది. అంటే సమస్త ప్రాణికోటికి నీటిని అందించే వాడు కనుకనే విష్ణువుకు నారాయణుడనే పేరు వచ్చింది. అంతేకాదు, విష్ణువు నీటి నుంచి ఉద్భవించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకు కూడా ఆయన్ను నారాయణుడని పిలుస్తారు.

English summary

Lord Maha Vishnu was also called as Narayana and here is the reason why Maha Vishnu was called as Narayana.