ఆడవారి నోటిలో రహస్యాలు దాగవని ఎందుకంటారంటే?

The Reason Why Secrets Will Be Revealed Quickly From Women Mouth

11:03 AM ON 20th October, 2016 By Mirchi Vilas

The Reason Why Secrets Will Be Revealed Quickly From Women Mouth

ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే ఏదేని ఓ విషయం దాగి ఉంటే దాన్ని రహస్యం అంటారు, కానీ అదే విషయం ఇద్దరు కాకుండా ఇంకా అంతకు మించిన సంఖ్యలో ఇతరులకు తెలిస్తే దాన్ని రహస్యం అనరు. అతి రహస్యం బట్టబయలు అనే సామెత ఉండనే ఉందిగా. ఇక కొన్ని రహస్యాలనైతే కొంతమంది రెండో వ్యక్తికి కూడా తెలియకుండా జీవితాంతం తమలోనే దాచి పెట్టుకుంటారు. కానీ ఇంకొందరు అలా కాదు, ఏదైనా ఓ కొత్త రహస్యం తెలిస్తే చాలు, దాన్ని ఇతరులకు చెప్పడంలో ఎక్కడ లేని ఆసక్తిని ప్రదర్శిస్తారు. అయితే సాధారణంగా కేవలం ఆడవారికి మాత్రమే ఇలా రహస్యాలను బయటికి చెప్పే అలవాటు ఉంటుందట. అందుకే ఆడవారి నోట్లో మాట దాగదని అంటారు. ఇలా స్థిరంగా సమాజంలో ఓ అభిప్రాయం పాతుకుపోవడం వెనుక అసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1/5 Pages

మహాభారతం గురించి మీకు తెలుసుగా. అందులో కుంతీ దేవి పుత్రులే పాండవులు. అయితే పాండవులను కనకముందు కుంతి సూర్య భగవానుడి అనుగ్రహంతో కర్ణున్ని కంటుంది. కానీ ఆమెకు అప్పటికి పెళ్లి కాకపోవడంతో ఆ విషయం నలుగురికీ తెలిస్తే ఇబ్బంది అవుతుందని గమనించిన ఆమె శిశువుగా ఉన్న కర్ణున్ని నదిలో విడిచి పెడుతుంది. అనంతరం కర్ణుడు వేరే వారి వద్ద పెరగడం, విద్యలు అభ్యసించడం, కౌరవుల చెంత చేరడం, పాండవులతో యుద్ధం అన్నీ అవుతాయి. ఆ యుద్ధంలో కర్ణుడు మరణిస్తాడు కూడా. అయితే కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన అనంతరం ధర్మరాజు ఆ యుద్ధంలో మృతి చెందిన తన కుటుంబ సభ్యులకు పిండ ప్రదానాలు చేసి, కర్మలు నిర్వహిస్తాడు.

English summary

Some of the people will say that the secrets will be revealed quickly from women mouth. Here is the reason why people will think like that and why secrets will never be secret in women mouth.