అప్పులోళ్ళ వత్తిడి తట్టుకోలేక జంప్ అవుతున్నారా?

The Reason Why Ysrcp MLAs Joining In TDP

06:00 PM ON 15th April, 2016 By Mirchi Vilas

The Reason Why Ysrcp MLAs Joining In TDP

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంత పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే 10మంది కి పైగా పార్టీ వీడిపోగా, తాజాగా విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, ప్రస్తుతం బొబ్బిలి రాజులు కూడా వెళ్లి పోతున్నారు. ఎంఎల్ఎ సుజయ్ కృష్ణ రంగారావు ఈమేరకు టిడిపితో మంతనాలు సాగించినట్లు చెబుతున్నారు. అయితే ఇలా పార్టీ మారడానికి వెనుక మర్మం ఏమిటనే ప్రశ్నకు సమాధానంగా ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క కారణం ఉండొచ్చు. కొందరికి రాజకీయ కారణం మరొకరికి కేసులు , ఇంకొకరికి ఆత్మాభిమానం , మరికొందరికి నియోజక వర్గ అభివృద్ధి ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో కారణం వుంటుంది. అయితే యూనివర్సల్ గా ఎక్కువ మందికి మ్యాచ్ అయ్యే ఆసక్తికరమైన కారణం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:భర్తకు మత్తిచ్చి భార్య పై అత్యాచారం చేసిన డాక్టర్

వైసిపి తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన అనేక మంది నాయకులు ప్రస్తుతం భారీస్థాయిలో అప్పుల ఊబిలో కూరుకు పోవడమే ఇలా జంపింగ్ చేయడానికి కారణమని అంటున్నారు. అయితే ఈ అప్పుల బాధలున్నది కేవలం వైస్సార్ సిపికి మాత్రమే కాదు. తెలుగుదేశంలో ఉన్న సిటింగ్ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అప్పుల ఊబిలో కూరుకునే ఉన్నట్లుగా తెలుస్తోంది. పదేళ్ళు అధికారం లేక ఖర్చు పెట్టిన తెలుగు తమ్ముళ్ళు అప్పుల పాలైనా, ఇప్పుడు అధికార లోకి రావడం వలన వారికి అప్పులిచ్చిన వారు కూడా పెద్దగా ఒత్తిడి చేయడం లేదట. దీంతో వారు కాస్త సేఫ్ జోన్ లో కి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే వైసిపి వాళ్లకు ఈ వెసులు బాటు లేకపోవడంతో ఈ ఒత్తిడులు తప్పించుకోవడానికే వెళుతున్నారనేది ప్రస్తుతం నడుస్తున్న చర్చ.

ఇవి కూడా చదవండి:ఇలా అయితే మా పరిస్థితేంటంటున్నసుమ

ఈ విషయం ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ ఇందుకు లాజికల్ గా చాలా కారణాలు సరిపోతున్నాయని అనిపిస్తుంది. వైఎస్సార్ మరణించిన తర్వాత వైస్సార్ సిపి ఆహికారంలోకి తప్పకుండా వస్తుందనే నమ్మకంతో అనేక మంది నాయకులు తొలినుంచి ఖర్చు పెడుతూనే వచ్చారు. తమ తమ నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులకు విరాళాలు ఇవ్వడం, అడిగిన వారికి లేదనకుండా భారీ మొత్తాలు ఇస్తూ పోవడం ఇలా పెద్దఎత్తున నిధులు ఖర్చు చేశారు. ఇక జగన్ బర్త్ డే - వైఎస్సార్ జయంతి వంటివి వచ్చిన రోజుల్లో ప్రతినియోజకవర్గాల్లో హోరెత్తించారంటే ఆశ్చర్యం కాదు.

ఇవి కూడా చదవండి:అతి పొడవైన రైలు వంతెనలు

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊర్లలో గుడులు కట్టడం - చిన్న చిన్న పనులు జరుగుతూ ఉంటే వాటికి భారీగా విరాళాలిస్తూ ఖర్చు పెడుతూ పోయారు. ఖచ్చితంగా తమ ప్రభుత్వం వస్తుందనుకుంటే.. ఆ కల నెరవేరలేదు. భారీ ఖర్చులకు తమ వద్ద ఉన్న సొమ్ము పోగా చాలా మంది అప్పులు చేసి మరీ అధికారం మీది ఆశతో వెచ్చించారు. ఖర్చు తడిపి మోపడైంది. అప్పులు మీద పడ్డాయి. పార్టీ అధికారంలోకి రాలేదు కదా , కనీసం ఖర్చులు తగ్గలేదు. పైగా రోజు రోజుకూ ఖర్చు తప్ప ఆద్యం లేదు. దీంతో అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి తగ్గించుకోవడానికి... చాలామంది అధికార పార్టీలోకి వెళ్లిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి.. ఏదో నాలుగు పనులు చేయించుకుని కాసిని డబ్బులు ఆర్జించినా.. అప్పులనుంచి గట్టున పడవచ్చుననేది వారి ఆలోచనగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి మెజార్టీ ఎం ఎల్ ఎ ల జంప్ కి ఆర్ధిక బాధలే కారణమని తెలియడం , టిడిపి వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారని ఆరోపణలు రావడం చూస్తుంటే, ధనం ఎలాంటి కీలక పాత్ర గా మారిందో వేరే చెప్పనవసరం లేదు.

ఇవి కూడా చదవండి:

పేరు మార్చుకుని అడల్ట్ సినిమా లో నటిస్తుంది

రూపాయి నాణెం పైన సింబల్ మీనింగ్ తెలుసా ?

English summary

Recently Many Ysrcp MLA's were joining in Telugu Desham Party in Andhra Pradesh.They were changing party because of Lack of money with Opposition Party MLA's