ధోనీ కెప్టెన్సీని వదులుకోవడానికి అసలు కారణాలు ఇవేనట 

The Reasons Why Dhoni Quit From Captaincy

11:43 AM ON 6th January, 2017 By Mirchi Vilas

The Reasons Why Dhoni Quit From Captaincy

ద్రావిడ్‌ నుంచి  2007లో క్రికెట్  సారథ్య బాధ్యతలు స్వీకరించిన ధోనీ.. భారతకు ఎన్నో ఘన విజయాలు అందించాడు. 2007లో ఐసీసీ వరల్డ్‌ టీ-20, 2011లో వన్డే వరల్డ్‌కప్‌, 2013లో చాంపియన్స్‌ ట్రోఫీలను మహీ నేతృత్వంలో టీమిండియా సాధించింది. ధోనీ హయాంలో 2009లో టెస్టుల్లో టాప్‌ ర్యాంకును భారత జట్టు కైవసం చేసుకుంది. ధోనీ నాయకత్వంలో భారత 199 వన్డేలు ఆడితే.. 110 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 72 టీ-20ల్లో 41 నెగ్గి.. 28 మ్యాచ్‌ల్లో ఓడింది. కెప్టెన్‌గా వన్డేల్లో 54 సగటుతో 6,633 పరుగులు చేశాడు. సారథిగా టీ-20ల్లో 122.60 సగటుతో 1,112 రన్స్‌ సాధించాడు. అయితే   గత కొన్ని నెలలుగా ధోనీపై తీవ్ర ఒత్తిడి ఉంది. టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ రాణిస్తున్న తరుణంలో విరాట్‌నే అన్ని ఫార్మెట్‌లకు కెప్టెన్‌గా చేయాలని సెలక్టర్లపై కూడా ఒత్తిడి ఉంది. జనవరి 15 నుంచి ఇంగ్లండ్‌తో మొదలు కానున్న పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు కోహ్లీని సారధిగా చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ఓ దశాబ్దం టీమిండియా సారధిగా ఉన్న కెప్టెన్ కూల్ సంక్షిప్తంగా ఈ ‘ఇన్నింగ్స్’కు ముగింపు పలికాడు. బుధవారం సాయంత్రం తన నిర్ణయం ప్రకటించిన ధోనీ.. ఉదయం నాగపూర్ శివారు జమ్తాలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గుజరాత్, జార్ఖండ్ మధ్య రంజీ సెమీ ఫైనల్ జరుగుతోంది. సాయంత్రం చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్‌తో మాట్లాడిన ధోనీ.. ‘ఓకే దట్స్ ఇట్’ అని చెప్పాడంతే. అదే అతను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం. ఇక ధోనీ కెప్టెన్‌గా తప్పుకోవడానికి ఈ కారణాలు కనబడుతున్నాయి..

1/6 Pages

1) ఇటీవల ధోనీ ఆటతీరు..

ధోనీ ఫామ్‌లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారి తప్పకుండా గెలిపించేవాడు. మ్యాచ్ విన్నింగ్ ఆట ఆడేవాడు. బంతులను టెక్నిక్‌తో ఆడి బౌండరీలు, సిక్స్‌లు బాదేవాడు. కానీ ఇటీవల అలాంటి ఆటతీరు కనబడటం లేదు. మ్యాచ్‌లను గెలుపుతో ముగించలేకపోతున్నాడు. 2016 ఆగష్టు 27న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో లాస్ట్ బాల్‌కు రెండు పరుగులు చేయాల్సి ఉండగా ధోనీ ఔటయ్యాడు. పైగా ఆ మ్యాచ్‌లోనే గత 23 టీ20ల్లో ధోనీ 30 కంటే ఎక్కువగా పరుగులు చేయగలిగాడు. ఢిల్లీలో న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్‌లో దిగి కూడా 69 బంతుల్లో 35 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది.

English summary

M.S.Dhoni was one of the most successful captain in cricket and previously he was suddenly retired from test format and suddenly he was quit from the captaincy of ODI;s and T20's. Here are the reasons why Dhoni quit from captaincy.