కాశీ తాళ్లు వెనుక అసలు రహస్యం ఇదే

The Secret Behind Why People Wear Black Tthreads On Their Ankles

10:43 AM ON 29th December, 2016 By Mirchi Vilas

The Secret Behind Why People Wear Black Tthreads On Their Ankles

ఇప్పుడు తగ్గింది కానీ గతంలో ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్తే,ప్రసాదం పొట్లం కట్టి అందిరికీ పంచేవారు. అందులో ప్రసాదంతో పాటు కాశీ తాడు కూడా ఉండేది. అది చేతికి కట్టుకోడమో,మెళ్ళో కట్టుకోడమో చేసేవారు. ఇక గతంలో నల్లరంగులో మాత్రమే లభ్యమయ్యే ఈ తాళ్లు ఇప్పుడు వివిధ రంగుల్లో దొరుకుతున్నాయి. కాశీ తాళ్లు మనం అనేక ప్రముఖ యాత్రాక్షేత్రాల్లో విక్రయించడం చూస్తుంటాం. అయితే ధర్మశాస్త్రాల్లో వీటిని కాశీతోరం అని వ్యవహరించారు. వీటిని మనం కంకణంలా కట్టుకుంటాం. ఈ దారాన్ని దేవతా పూజలో వుంచి అనంతరం కట్టుకోవడం మంచిది. తిరుమలలో ఎక్కువగా నలుపు, ఎరుపు దారాలు వుంటాయి. వీటిని కొనుగోలు చేసి సొంతవూర్లకు వచ్చాక బంధు మిత్రులకు ఇస్తుంటాం. ఇదొక సంప్రదాయంగా మారింది. ఇప్పటికీ కొన్ని చోట్ల కొనసాగుతోంది. దేవతామూర్తుల పాదాల వద్ద వుంచి అనంతరం వీటిని కట్టుకుంటే శ్రేయస్కరం. కొందరు ఒక పనిని తలపడితే అది పూర్తిచేసేవరకు విశ్రమించరు. ఇలాంటి వారినే మనం కంకణం కట్టుకొని పూర్తిచేశాడు అన్న సామెతను వాడుతాం. కంకణధారులు నిబద్ధత కలిగి వుండాలన్న అర్థం కూడా దీనిలో దాగివుంది. పసుపు, కాషాయం, ఎరుపు... తదితర రంగులు ఆయా దేవతల క్షేత్రాలకు సంబంధించినవి. అదండీ కాశీ తాళ్ల వెనుక అర్ధం పరమార్ధం. ఇక రక్షా బంధనాలు కూడా రకరకాల తాళ్లు , దారాలు వాడుతున్న సంగతి తెల్సిందే.

ఇవి కూడా చదవండి: అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి కి 45రోజుల పండగ ఎందుకో తెలుసా

ఇవి కూడా చదవండి: పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధిస్తే కలిగే శుభాలు ఇవే

English summary

When someone went to some temple then they used to bring prasadam and black threads and we see people tie black threads on their ankles. Here is the reaseon why people used to tie black threads to their ankles.