ట్రైన్ వెనుక 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

The secret behind X symbol at back side of the train

06:22 PM ON 9th June, 2016 By Mirchi Vilas

The secret behind X symbol at back side of the train

మనం కొన్నికొన్ని విషయాలు, వస్తువులు రోజూ చూస్తున్నా పెద్దగా పట్టించుకోం. కానీ దాని వెనుక పెద్ద కధే ఉంటుంది. చిన్న చిన్న విషయాలని పెద్దగా పట్టించుకోం కానీ దాని కధలోకి వెళ్తే దాని లోతు చాలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సందర్భం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.. ఆ విషయంలోకి వెళ్తే.. మీరెప్పుడైనా ట్రైన్ ఎక్కారా..? లేదా మీ ముందు నుంచి ట్రైన్ వెళ్లిపోతుంటే.. వెనకాల ఇంటూ సింబల్ పెద్దగా ఒక గుర్తు ఉండటం గమనించారా? అది ఎందుకు పెట్టారో? అంత పెద్దగా రైలు చివర మాత్రమే ఎందుకు పెట్టారో ఆలోచించారా? లేదా? అయితే ఎందుకో తెలుసుకోండి మరి.

ప్రతీ రైలు ఆఖరి బోగీ పై పెద్ద ఇంటూ గుర్తు లేదా ఎక్స్ గుర్తు ఉండడం చాలా సార్లు గమనించి ఉంటారు. అయితే అది ఒక గుర్తు మాత్రమే కాదు ఒక సంకేతం కూడా. అదేంటంటే.. ఈ రైలు బోగీల్లో ఇదే చివరిది అని దాని అర్థం. ఇంకాస్త పరీక్షగా చూస్తే... ఎల్వి అని ఆ బోగీ ఎడమ వైపు కింది భాగంలో ఒక చిన్న పాటి బోర్డు కూడా కనిపిస్తుంది. అంటే లాస్ట్ వెహికల్ అని అర్థం. వీటితో పాటు ఉండే మరో అతి ముఖ్యమైన సంకేతం ఆ బోగీ కింది మధ్యభాగంలో ఉండే రెడ్ లైటు. ఇవన్నీ రైలు ఆఖరి బోగీని సూచించే సంకేతాలు. రాత్రి వేళల్లో లైటు, పగటి వేళల్లో ఇంటూ మార్క్ తేలికగా గమనించగల సంకేతాలు కాబట్టే వాటికి అంత ప్రాముఖ్యం.

ఈ సంకేతాలలో ఏదో ఒకటి లేకపోతే మాత్రం ఆ రైలు ప్రమాదవశాత్తూ పూర్తి బోగీలు లేకుండా నడుస్తోందని అర్థం. అదండీ దీని వెనుక ఉన్న అసలు కధ..

English summary

The secret behind X symbol at back side of the train