కేదారనాధ్ క్షేత్ర విశిష్టత ఏమిటో తెలుసా ...

The Specialties Of Shri Kedarnath Temple

12:24 PM ON 15th December, 2016 By Mirchi Vilas

The Specialties Of Shri Kedarnath Temple

కోరింది తడవుగా వరాలిచ్చే దేవుడు పరమేశ్వరుడు. అందుకే బోళా శంకరుడు అని అంటారు. ఇక పరమేశ్వరుని దర్శించాలంటే ఎన్నో పవిత్ర క్షేత్రాలున్నాయి. అందులో పరమ పవిత్రమైనది కేదార్ నాథ్ మహాక్షేత్రం అని చెప్పాలి. ఎందుకంటే, హిమగిరుల్లో నెలకొన్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా యుగయుగాలుగా వేలాదిమంది భక్తుల పూజలు అందుకుంటోంది. రుద్రహిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే భక్తులు చాలా శ్రమించాల్సి వుంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలోని పర్వతాల్లో పరమశివుడు కేదారేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. శీతాకాలంలో ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. వేసవికాలం ప్రారంభంలోనే ఆలయాన్ని తెరవడం సంప్రదాయంగా వస్తోంది. మందాకిని నది జన్మస్థానం కూడా కేదార్ నాథ్ సమీప పర్వతాల్లోనే వుంది.

1/15 Pages

శివుడు ఇక్కడ స్వయంభువు..

పరమశివుడు ఇక్కడ స్వయంభువుగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంటాడు. ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులు విజేతలుగా నిలుస్తారు. అయితే యుద్ధంలో తమ సొంత దాయాదులను చంపవలసివచ్చినందుకు ఎంతగానో వేదనకు గురవుతారు. తమ పాపాల నుంచి విముక్తి పొందేందుకు మహేశ్వరుని దర్శనం కోసం హిమాలయాలకు చేరుకుంటారు.

English summary

ShriKedarnath Temple was famous in not in India but it was famous all over the world and here are some of the specialties of Shri Kedarnath Temple and how to reach the temple.