గుండె పిండే ధోని స్టంప్స్ కధ

The Story Behind Dhoni Takes Stumps

12:00 PM ON 14th March, 2016 By Mirchi Vilas

The Story Behind Dhoni Takes Stumps

సాయం చేసిన స్నేహుతులను , కన్నవాళ్ళను మరిచిపోయి, తను తన కుటుంబం అనే రీతిలో ఎవరికీ వారు నడుస్తున్న కాలమిది. అయితే చిన్ననాటి స్నేహితుని కోరిక తీర్చడానికి పరుగుల కెరటం ధోనీ పడుతున్న శ్రమ ఎంతో వుంది. అది తెలుసుకోవాలంటే, ఒక లుక్ వేయాల్సిందే.... మ్యాచ్ ఎవరితోనైనా కానీ. విజయం సాధిస్తే ధోని అడుగులు స్టంప్స్ వైపు పడతాయి. ఓ స్టంప్‌ను పెకిలించి చేతితో పట్టుకుని ఆనందంగా పెవిలియన్ వైపు వెళతాడు. అయితే సదరు స్టంప్ మరిచిపోయి, ధోని ఏనాడు డ్రెస్సింగ్ రూంకు వెళ్లిన సందర్భాలు లేవు. క్రికెట్ ప్రేమికులకు, ధోని అభిమానులకు ఈ విషయం బాగా తెలుసు. అయితే ధోని అలా తీసుకెళ్తున్న స్టంప్స్‌ను ఏం చేస్తున్నట్టు? ఈ విషయంలో చాలా ఏళ్లుగా బుర్ర పీక్కుంటున్న ఓ మీడియా రిపోర్టర్ ఉండబట్టలేక ధోని ని అడిగేసాడు. "మ్యాచ్ పూర్తయిన తర్వాత స్టంప్స్ కలెక్ట్ చేయడాన్నిచాలా సంవత్సరాలుగా చేస్తున్నా. ఆ స్టంప్‌ను చూసినప్పుడు అది ఫలానా మ్యాచ్‌లోనిది అని గుర్తొస్తుంది.అయితే స్టంప్స్‌పై మాత్రం ఎటువంటి మార్క్ చేయను’’ అని ధోని వివరించాడు. అయితే నిజానికి ధోని స్టంప్స్ కలెక్షన్ వెనుక చాలా పెద్ద కథే ఉంది. అదేమిటంటే,

ఓ నేపాలి వాచ్‌మన్ కొడుకు కుల్బిందర్, ధోనీకి చిన్ననాటి మిత్రుడు. కేవలం అతడు స్నేహితుడు మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువనట. ఎందుకంటే ధోనిని క్రికెట్‌ వైపు ప్రోత్సహించింది కుల్బిందరే. కాలక్రమంలో ధోని స్టార్ క్రికెటర్‌గా ఎదిగి ప్రపంచంలోనే మేటి క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకోగా, కుల్బిందర్ రేంజ్ తక్కువ స్థాయిలోనే ఆగిపోయంది. అనంతర కాలంలో కుల్బిందర్ ఓ ఇంటిని నిర్మించుకున్నాడు. ధోని ఎంతో ఎత్తుకు ఎదిగినా ఇంటి నిర్మాణానికి అతని నుంచి ప్రాణమిత్రుడు ఏమీ ఆశించలేదు. అయితే ఒకే కోరిక ధోని ని కోరాడట. తాను నిర్మించుకున్న చిన్న ఇంటి చుట్టూ స్టంప్స్‌తో ప్రహరీ లాంటిది కట్టుకోవాలనుకుంటున్నానని, అందుకు 320 స్టంప్స్ కావాలని అడిగాడట. అడిగింది చిన్న కోరిక అయినా, ఇక అప్పటినుంచి మిత్రుడి కోరిక మేరకు ధోని స్టంప్స్‌ను కలెక్ట్ చేస్తూనే ఉన్నాడు. మరి కలెక్షన్ పూర్తయిందా లేదా అన్నది తేల్చలేదు. ధోనీ చేస్తున్న పని చూసాక, వారెవ్వా అని అభినందించని వారెవ్వరూ ఉండరు గా ...

English summary

Indian Cricket team Captain Mahendar Singh Dhoni takes one stumps when India wins every match .One reporter asked this why dhoni was taking stumps and then dhoni replied to him that one of his best friend who supported dhoni for playing cricket asked him to give stumps and that’s the reason behind it.