దర్శకేంద్రుని 'గడ్డం

The Story Behind Raghavendra Rao Beard

11:02 AM ON 14th March, 2016 By Mirchi Vilas

The Story Behind Raghavendra Rao Beard

తెలుగు చిత్రసీమలో మాటలు తక్కువ చేతలు ఎక్కవ గల సత్తా గల కమర్షియల్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. ఎన్టిఆర్ తో తీసినా , కృష్ణ తో తీసినా , చిరంజీవితో చేయించినా, బాలయ్యతో , చివరకు అల్లు అర్జున్ తో తీసినా రాఘవేంద్రరావు మార్క్ అంటే జనానికి ఓ అంచనా వుంటుంది. దర్శకుని చూసి సినిమాకు వెళ్లి పరిస్థితి కల్పించిన దర్శకుల్లో రాఘవేంద్రరావు ని ప్రధానంగా చెప్పుకోవాలి. ఎంతోమంది శిష్యులను తయారు చేసారు. అంతేకాదు హీరోయిన్లకు గ్లామర్ అద్దిన దర్శకేంద్రుడు ఈయన. అయితే ఈయన తరచూ గెడ్డం పెంచుతూ వుంటారు. ఎందుకబ్బా అంటూ చాలామంది చర్చించుకుంటూనే వుంటారు. అయితే దానికి కారణం ఇటీవల ఓపెన్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో బయట పెట్టేసారు. "నా తొలి సినిమా అనుకున్నంత సక్సెస్‌ రాలేదు. నా రెండో చిత్రం ‘జ్యోతి’ చిన్న సినిమా మొదలుపెట్టాక శ్రీ వేంకటేశ్వరస్వామి మీద భక్తితో సినిమా పూర్తయ్యేవరకు గడ్డం తీయనని మొక్కుకున్నా. సినిమా పూర్తయ్యాక గడ్డం తీశా. ఇక దాంతో నా ప్రతి సినిమా మొదలుపెట్టినప్పటినుంచి గడ్డం పెంచటం.. పూర్తయ్యాక గడ్డం తీయటం సెంటిమెంట్‌గా మారింది" అంటూ గెడ్డం కధ చెప్పేశారు.

English summary

Director K.Raghavendra Rao says that he will grow beard because of his sentiment.sentiment. Raghavendra Rao says that he will grow beard while shooting movie and after shooting completes he will go to Lord Venteswara Swamy Temple and cut that beard there.