బాలయ్య సినిమాకి పెద్ద కధే వుంది

The Story Of Gowthami Putra Satakarni Movie

10:22 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

The Story Of Gowthami Putra Satakarni Movie

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతున్న పేరు గౌతమీ పుత్ర శాతకర్ణి. .. ఈ శాతవాహన రాజు చరిత్రను నందమూరి బాలకృష్ణ వందో సినిమా కథాంశంగా ఎంచుకోవడంతో అసలు ఆ చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. ముఖ్యంగా అభిమానులు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఒకసారి చరిత్ర వివరాల్లోకి వెళ్తే, తెలుగు గడ్డను సుదీర్ఘ కాలం అంటే, దాదాపు 500 ఏళ్లు పాలించిన శాతవాహన వంశానికి చెందినవాడే ఈ గౌతమీ పుత్ర శాతకర్ణి.... కాకతీయుల కంటే ముందు తెలుగు రాజ్యాన్ని శాతవాహనులు పాలించారు. గొప్ప పరిపాలనతో తెలుగు ప్రజలకు సుఖసంతోషాలు పంచినప్పటికీ.. వీరి తర్వాత వచ్చిన కాకతీయులు ఆ గొప్పదనం గురించి తర్వాతి తరాలకు తెలియకుండా చేశారంటారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర.. ఒరిస్సా.. తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు శాతవాహనుల రాజ్యంలో భాగాలుగా ఉండేవి. వీటిన్నంటినీ కలిపి శాతకర్ణి పరిపాలించాడు . శాతవాహన కాలంలో మొత్తం 30 మంది రాజులు తెలుగు రాజ్యాన్ని పరిపాలించగా.. అందులో 23వ వాడు అయిన గౌతమీ పుత్ర శాతకర్ణి మొత్తం 30 మందిలోనూ అత్యుత్తమం అనిపించుకున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలనలో ఎదురైన అనేక సవాళ్లను ఛేదించి.. శాతవాహనుల ఆధిపత్యాన్ని దేశం మొత్తానికి చాటి చెప్పి.. గొప్ప పరిపాలనతో ప్రజలు సుఖ సంతోషాలు అందించాడని చరిత్ర చెబుతోంది.

ఇవి కూడా చదవండి: మెగా ఫాన్స్ కి ఇరకాటం

గౌతమీపుత్ర శాతకర్ణి జీవితంలో ఎన్నో ముఖ్య ఘట్టాలున్నప్పటికీ.. వాటన్నింటినీ రెండున్నర మూడు గంటల సినిమాలో చూపించడం అంత సులువైన విషయం కాదు. అంతే కాక వందల ఏళ్ల కిందటి పరిస్థితుల్ని ప్రతిబింబించేలా సినిమా తీయడమూ సవాలే. మరి క్రిష్ ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడు.. బాలయ్య ఈ పాత్రను ఎలా పోషిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రి ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. మేలో షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. ఇంటర్నెట్లో ఎంత వెతికినా గౌతమీ పుత్ర శాతకర్ణి గురించి సమాచారం దొరకట్లేదు. ఐతే దర్శకుడు క్రిష్.. ఎంతో పరిశోధన జరిపి.. ఎన్నో గ్రంథాలు తిరగేసి.. చాలా మంది చరిత్రకారుల్ని కలిసి.. గౌతమీ పుత్ర శాతకర్ణి గురించి చాలా విషయాలు తెలుసుకుని.. ఎంతో ఉద్వేగానికి లోనై ఈ సినిమాను పట్టాల మీదికి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ చారిత్రిక సినిమా ముహూర్తపు షాట్ కి తెలంగాణా సిఎమ్ కెసిఆర్ అతిధిగా వచ్చి ఈ సినిమా తొలి షో కుటుంబ సమేతంగా చూస్తానని అన్నారంటే, ఈ సినిమా రేంజ్ లో వుంటుందో అంచనా వేసుకోవచ్చు. మరి దర్శకుడు క్రిష్ ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి: ఆ దేశంలో అమ్మాయిలు కన్యలుగా ఉంటే స్కాలర్షిప్ ఇస్తారట

ఇవి కూడా చదవండి: 5 సంవత్సరాల పాపకి వివాహం చేసిన కసాయి తల్లిదండ్రులు

English summary

Nandamuri Balakrishna was Acting in Gowthami Putra Satakarni movie under the direction of Director Krish and the story line of this movie was made based on the true story of Gowthami Putra Sathakarini who was the 23rd king of Sathavahana Kingdom.