కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఐఐటి ఖరగ్ పూర్ మాజీ విద్యార్థి

The Story Of IIT Student Anand As A Uber Cab Driver

10:38 AM ON 7th July, 2016 By Mirchi Vilas

The Story Of IIT Student Anand As A Uber Cab Driver

అవునా, ఈ సినిమా రిపీట్ అవుతుందో లేదో తెలీదు కానీ, ఈ సినిమాలో సీన్ మాదిరిగా ఓ ఘటన చోటుచేసుకుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సమరసింహారెడ్డి మూవీలో తన వద్ద పనిచేసే పృథ్వీరాజ్ చనిపోతే బాలకృష్ణ అతడి వేషంలో వాళ్ల ఊరికి వెళ్లి, అతడి పేరుతో హోటల్ లో పనిచేస్తూ, అతడి చెల్లెళ్లను సంరక్షించడం మనం చూసాం. కానీ వృత్తి తేడాగానీ.. సేమ్ టు సేమ్ అలాంటిదే నిజ జీవిత ఘటన ఇది. తాజాగా ఇటీవల ఈ ఘటన వెలుగుచూసింది. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బెంగళూరుకు చెందిన శ్రీకాంతసింగ్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు విస్తృతంగా ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ఇప్పటికే దీన్ని 12 వేల మంది షేర్ చేయగా, 80 వేలమందికి పైగా లైక్ చేశారు. వందల్లో కామెంట్లు పోస్టు చేస్తున్నారు. జాతీయ మీడియాలో సైతం దీనిపై కథనాలు వెలువడ్డాయి. మరి మనం స్పందిద్దామా. వివరాల్లోకి వెళ్తే..

జూలై 1న శ్రీకాంత సింగ్ ఆఫీసు నుంచి తన ఇంటికి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆనంద్ అనే వ్యక్తి క్యాబ్ తో వచ్చాడు. అతడితో శ్రీకాంత ఇంగ్లీష్ లో మాట్లాడగా.. ఆనంద్ కూడా అంతే సులువుగా ఆంగ్లంలో బదులిచ్చాడు. ఒక క్యాబ్ డ్రైవర్ అంత ధారాళంగా ఇంగ్లిష్ మాట్లాడటంతో ఆశ్చర్యపోయిన శ్రీకాంత.. ఆశ్చర్యంగా మీరు సాధారణ డ్రైవర్ లా కనిపించట్లేదు.. మీరెవరు? అని అడిగాడు. దానికి ఆ డ్రైవర్ ఇచ్చిన సమాధానానికి షాకయ్యాడు.

ఆనంద్ 1986 ఖరగ్పూర్ ఐఐటీ విద్యార్థి. అమెరికాలో, ఇండియాలో కలిపి దాదాపు 30 ఏళ్లపాటు ఉన్నతోద్యోగం చేశాడు. ఉబర్ ద్వారా ఆయన 50 కార్లను క్యాబ్ లుగా తిప్పుతున్నాడు. మైసూరులో ఆయనకు స్ట్రాబెర్రీ తోటలు కూడా ఉన్నాయి. కొంతకాలం క్రితం తన డ్రైవర్లలో ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. అతడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయబోయారు. దాన్ని వారు తిరస్కరించడంతో.. ప్రమాదానికి కారణమైన కారునే రిపేర్ చేయించి, స్వయంగా తానే ఆ కారు డ్రైవర్ గా మారి.. వచ్చిన మొత్తాన్ని ఆ కుటుంబానికి ఇస్తున్నారు. ఆనంద్ చెప్పిన విషయం విన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీకాంతకు కళ్ల నీళ్లుతిరిగాయి. వెంటనే ఆయన ఈ విషయాన్ని ఫేసుబుక్ లో పోస్టు చేశాడు. ఆనంద్ డ్రైవర్ గా తాను తిరిగిన రూట్ మ్యాప్ ను కూడా ఆ పోస్ట్ లో పెట్టారు. దీనికి నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:బాయ్ ఫ్రెండ్ కి పంపబోయి స్టూడెంట్ కి ఆ ఫోటోలు పంపేసింది!

ఇవి కూడా చదవండి:రైల్వే శాఖకు సుప్రీం మొట్టికాయలు

English summary

Here is the inspiring story of an IIT Graduate Named Anand who became an Uber Car Driver who owned 50 Uber cabs in Bangalore. He was changed as driver because when one of the his cab driver died in an accident and the family of the driver refused to take money from Anand and from then onwards he became cab driver and giving the money to the died car driver family.