నిత్య యవ్వనం కోసం టాబ్లెట్

The Tablet Makes You Look Young Forever

12:49 PM ON 6th June, 2016 By Mirchi Vilas

The Tablet Makes You Look Young Forever

మనిషికి వయసు పెరిగే కొద్దీ మతిమరుపు(డిమెన్షియా) తదితర వయసు సంబంధిత రుగ్మతలు వేధిస్తుంటాయి! సహజంగా మనిషి ఎదుగుదల క్రమంలో వయసును సూచించే మార్పులిలానే వుంటాయి. మనిషి వృద్ధాప్యాన్ని భరించలేడు. ఏదైనా అమృతం దొరికితే యవ్వనం లోకి వెళ్లిపోవాలని భావిస్తాడు. అందుకే ప్రపంచంలోని శాస్త్రవేత్తలు వృద్ధాప్యాన్ని వెనక్కు నెట్టేందుకు, యవ్వనాన్ని పెంచేందుకు ఓ మాత్రను తయారు చేశారు. ఇంతకుముందు నుంచే శాస్త్రవేత్తలు వయసు మళ్లడంపై పరిశోధనలు చేస్తున్నా..మన జన్యువుల క్రమాన్ని (సీక్వెన్స్ ) మార్చడమో లేదంటే వాటి ఆధారంగా పరిశోధనలు చేయడమో చేశారు. కానీ, ఓ మాత్ర ద్వారా యవ్వనాన్ని అట్టిపెట్టుకునేందుకు అమెరికాలోని మెక్ మాస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మాత్ర అంటే అదేదో సంక్లిష్ట పదార్థాలతోనూ కాదు..మనం బలం కోసం వాడే బీ-కాంప్లెక్స్ వంటి విటమిన్లతో కూడిన టాబ్లెట్టే.

మన ఆహారంలోనే దొరికే దాదాపు 30 రకాల విటమిన్లు, ఖనిజ ధాతువులతో ఈ మాత్రను తయారుచేశారు. విటమిన్ బీ, సీ, డీ, ఫోలిక్ యాసిడ్ , గ్రీన్ టీ ఉత్పత్తుల వంటి వాటిని ఉపయోగించి మాత్రను అభివృద్ధి చేశారు. దీని ద్వారా అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధులకూ విశ్రాంతినివ్వొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మరో రెండేళ్లలో దీనిని మానవులపై పరీక్షించేందుకు సన్నద్ధమవుతున్నారు.

ప్రస్తుతం టాబ్లెట్టను సగం మెదడు కణాలు చచ్చిపోయిన ఎలుకల్లో పరీక్షించారు. కొన్ని నెలల పాటు ఈ మాత్రను ఇచ్చిన తర్వాత ఆ ఎలుకలు ఆరోగ్యవంతంగా తయారయ్యాయని, మెదడు కణాల నష్టాన్ని నివారించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేగాకుండా వాటి దృష్టిని మెరుగుపర్చిందని, ఘ్రాణ శక్తిని పెంచిందని గుర్తించారు. పరీక్షల సమయంలో ఎలుకల వయసు 22 నెలలు (మానవుల వయసుకు 70 నుంచి 80 ఏళ్లకు సమానం) ఉన్నాయని, ఈ మాత్రను ఇచ్చిన తర్వాత వాటి వయసు మళ్లడం 50 శాతం తగ్గిందని వివరిస్తున్నారు. కణాల జీవితాన్ని నిర్దేశించే మైటోకాండ్రియాపై ఈ మాత్ర ప్రభావాన్ని చూపించిందని, అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయని భావిస్తున్నారు. దేవతలు అమృతం సేవించి నిత్య యవ్వన వంతులుగా వుంటుంటే , ఇప్పుడు మానవడు కూడా ఆ అదృష్టం పొందనున్నాడా?

ఇవి కూడా చదవండి:కస్టమర్లకు కంపెనీ ఇచ్చే రోబోలు!

ఇవి కూడా చదవండి:దిష్టి మంత్రం గురించి తెలిస్తే షాకవుతారు!

English summary

The scientists of McMaster University were invented a pill that makes you look younger forever. Scientists have been tested that capsule on Rats and that was successful.