ఇంపాల్ లో కూలిన ఆరంతస్తుల భవనం 

The Union Home Ministry on the review of earthquake

11:46 AM ON 4th January, 2016 By Mirchi Vilas

The Union Home Ministry on the review of earthquake

భూకంపం పై కేంద్ర హొమ్ శాఖ సమీక్ష

భారత్ - మయన్మార్ బోర్డర్ లో సోమవారం తెల్లవారుఝామున సంభవించిన భూకంపం ప్రభావం భారత్ పై ఎక్కువే చూపింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల ను కుదిపేసింది. ఇంపాల్లో ఆరంతస్తుల భవనం పూర్తిగా కుప్పకూలినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. గువహటి నుంచి ఇంఫాల్‌కు 45 మంది గల రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తరలించినట్లు తెలిపారు. భూకంపం నేపధ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. భూకంప ప్రభావం, సహాయచర్యలపై ఎన్‌డీఎంఏ, ఎన్టీఆర్‌ఎఫ్‌, సమాచార, రక్షణ, ఇరత ముఖ్య శాఖలతో హోంశాఖ ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. భూకంపం కారణంగా పలు భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.

అయితే భూకంపం ఘటన ఎలా వుంటుందో , తెలుగింటి కోడలు.. కేంద్రమంత్రి అయిన నిర్మలా సీతారామన్ ప్రత్యక్షంగా చవిచూశారు. ఆదివారం పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో వున్న ఆమె ఈశాన్య రాష్ట్రాల్లోని కాఫీ తోటల్ని పరిశీలించేందుకు అక్కడకు వెళ్లారు. పలు ప్రాంతాల్లో పర్యటించి.. ఆదివారం సిలిగురిలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో విడిది చేసారు. హటాత్తుగా గది మొత్తం ఊగిపోవడంతో ఆమె ఆందోళనతో బయటకు పరుగు తీసారు. అయితే , ఫెద్ద ప్రమాదం లేకకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే భూప్రకంపనల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో మాత్రం ఆమె ప్రత్యక్షంగా అనుభవించారు. భూకంపం వచ్చిన విషయాన్ని ఆమె ట్వీట్ చేసారు.

English summary

A massive earthquake with 6.8 magnitude has occured in north west of Imphal in India near India-Mayanmar border.In this incident upto now 6 people were died and soo many people were injured.A six floors building was collapsed due to thisearthquake in Imphal