అబ్బో, దణ్ణం పెట్టి మరీ దోచేశాడు

Theft In Temple In Delhi

10:54 AM ON 30th June, 2016 By Mirchi Vilas

Theft In Temple In Delhi

దొంగల్లో ఈ దొంగ వేరయా అన్నట్టు ఉంది ఇతగాడి యవ్వారం. బుద్ధిగా దేవుడి గుడికొచ్చాడు. అటూ ఇటూ చూశాడు. దగ్గరలో ఎవరూ లేరు.. అంతే... దేవుడికి దండం పెట్టుకుని మరీ, దేవుడి విగ్రహం మీదున్న కిరీటాన్ని, బంగారు గొలుసును దొంగిలించి పారిపోయాడు. ఈ మధ్య దక్షిణ ఢిల్లీ న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని ఓ ఆలయంలో జరిగిన ఈ చోరీ కి సంబంధించి, ఇతగాడు చూపిన చోర కళ సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ఆలయ అర్చకులు ఈ చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు దర్యాప్తు చేసి, ఇతగాడ్ని పట్టుకున్నారు. డేవిడ్ ప్రధాన్ అనే ఈ దొంగ గతంలో కొన్ని హోటళ్ళలో వెయిటర్ గా పని చేశాడట. అయితే జాబ్ పోవడంతో ఈజీ మనీ కోసం దొంగ అవతారం ఎత్తి, వెరైటీగా చోరీ చేస్తున్నాడు. ఇప్పటివరకూ చేసిన దొంగతనాలన్నింటి గురించి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి:చిలక్కొట్టిన జామ పండు ఎందుకు తియ్యగా ఉంటుందో తెలుసా?

ఇవి కూడా చదవండి:ఇంట్లో దెయ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం ఎలా?

English summary

A Teenager was theft a Croun and Gold Chain in a Temple in Delhi in New Friends Colony and the Thief was caught in the CC TV camera.