టాబ్లెట్లు ఈ విధంగా వేసుకుంటేనే పని చేస్తాయట(వీడియో)

Their is a method to swallow a tablet

11:50 AM ON 2nd July, 2016 By Mirchi Vilas

Their is a method to swallow a tablet

ప్రతిదానికి ఓ విధానం ఉంటుంది. అలాగే టాబ్లట్లు వేసుకోడానికి కూడా ఓ పద్ధతి ఉంది. మారుతున్న కాలమాన పరిస్థితుల నేపథ్యంలో గ్లోబులైజేషన్ పెరిగిపోవటం.. ఆహారపు అలవాట్లలో మార్పులు.. టెన్షన్స్.. వంశపారంపర్య లక్షణాలు... ఇలా పలు రకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. పైగా ఇటీవల అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ప్రతిఒక్కరు ఏదో ఆరోగ్య సమస్యతో బాధపడే దుస్థితి వచ్చేసింది. ఇక సీజనల్ వ్యాధులు ఎలాగూ ఉన్నాయి. దీంతో ఆసుపత్రులు కిటకిటలాడిపోతున్నాయి. అనారోగ్యానికి అనుగుణంగా టాబ్లెట్లను వాడేవాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది.

రోజుకు పదుల సంఖ్యలో టాబ్లెట్లను వేసుకునే వారు ఉన్నారు. అయితే టాట్లెట్లను సక్రమంగా వేసుకోకపోతే అవి పని చేసే విధానంలో తేడా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే టాబ్లెట్లు ఎలా వేసుకోవాలన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది నిపుణులు సలహాలిస్తే, మరికొన్ని సంస్థలు ఏకంగా సర్వేలే చేపట్టాయి. కొందరు గ్లాసుడు నీళ్లతో టాబ్లెట్ వేసుకొంటారు. ఒక్కోసారి మధ్యలోనే టాబ్లెట్లను నమిలేస్తారు. పూర్తిగా మింగలేక వాటిని ఉమ్మేస్తారు. మరికొందరికి వాంతి అయ్యే సూచనలు కనిపిస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే వీటన్నింటినీ నివారించవచ్చు.

ఈ నేపథ్యంలో అసలు టాబ్లెట్లు ఎలా వాడాలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం తీసుకునే ముందు చేతులను శుభ్రం చేసుకున్న రీతిలోనే టాబ్లెట్ వేసుకొనే సమయంలో ఖచ్చితంగా చేతులను శుభ్రం చేసుకుని తీరాలని వైద్యులు సూచిస్తున్నారు. టాబ్లెట్ ను చల్లని నీటితో కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్లతో వేసుకోవాలని వైద్యులు అంటున్నారు. మొదట గ్లాస్ లో నీళ్లు తీసుకొని టాబ్లెట్ ను నాలుకపై పెట్టుకొని వెంటనే గ్లాస్ అంచులను పెదలాతో మూసివేసి గాలి లోపలికి రాకుండా టాబ్లెట్ మింగివేయాలి. దీని ద్వారా టాబ్లెట్ స్మెల్ ఉంటే మనం అంతగా ఇబ్బంది పడకుండా టాబ్లెట్ లోపలికి వెళ్లిపోతుంది.

ఇది ఉత్తమ పద్ధతి. ఇక టాబ్లెట్ గొంతులో అడ్డుగా పడిందన్న ఫీలింగ్ ఒక్కోసారి వస్తుంటుంది. దాన్ని నివారించేందుకు ముందు టాబ్లెట్ నాలుకపై పెట్టుకొని, ఆ తర్వాత నీటిని పుక్కిటపట్టి తలను కిందికి వాల్చి ఒకేసారి టాబ్లెట్ ను మింగేయాలి. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండదు. టాబ్లెట్ చేదుగా ఉన్నాయని పిస్తే లవంగం లాంటిది కొద్దిగా తీసుకొని కొరికితే కొద్ది సేపు నాలుక మొద్దుబారుతుంది. దీంతో వెంటనే టాబ్లెట్ వేసుకొంటే నాలుక రుచిని పసిగట్ట లేదు. కాప్యుల్స్ లాంటివి తీసుకొనేప్పడు మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. పొరపాటున వాటిని కొరికినా ఇబ్బందులు వస్తాయి.

టాబ్లెట్ మరీ పెద్దగా ఉన్నప్పుడు దానిని సగాలుగా చేసి వేసుకొనే అవకాశం ఉంటే మంచిదని కూడా వైద్యుల సూచన టాబ్లెట్ వేసుకోవటంలో ఇబ్బందికరమైన ఫీలింగ్ ఉండటంతోపాటు, మరింత చేదుగా ఉందనిపిస్తే కొంచెం షుగర్ ఓ చెమ్చాలో తీసుకొని టాబ్లెట్ వేసుకున్న అనంతరం వెంటనే షుగర్ ను నాలిక మీద వేసుకుంటే మంచిదట.

English summary

Their is a method to swallow a tablet