పొడుగ్గా ఉంటే క్యాన్సర్ తప్పదా?!

Their is more chances to cause cancer for height people

11:50 AM ON 9th September, 2016 By Mirchi Vilas

Their is more chances to cause cancer for height people

ఒరే పొట్టి, ఒరే పొడుగు ఇలా రకరకాల కామెంట్లు వింటుంటాం. కానీ పొడవైన వారు రోజు వారీ పనుల్లో పలు రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అయితే పొట్టిగా ఉన్న వారితో పోల్చితే పొడవైన వారు మరింత ఆరోగ్యంగా ఉంటారట. అయినా వారికి క్యాన్సర్ సోకే ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది. పొట్టివారితో పోల్చుతూ పొడవుగా ఉండే వారి ఆరోగ్య స్థితిగతులపై అమెరికాలోని ఓహయో స్టేట్ వర్శిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. పొట్టి వారితో పోలిస్తే పొడగరులకు గుండె జబ్బులు, వినికిడి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా తక్కువని అంటున్నారు.

పొట్టి వారి కంటే పొడగరులే కెరీర్ లో బాగా రాణించడమే కాకుండా, ఎక్కువ సంతోషంగా కూడా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. అయితే వీరికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు లేకపోలేదని అంటున్నారు. పొడవైన వారికి స్కిన్ కేన్సర్, కోలన్ కేన్సర్, కిడ్నీ కేన్సర్ వంటి కొన్ని రకాల కేన్సర్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. కనుక పొడవుగా ఉండే వారు తరచు క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటుండడం మంచిదని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: అతను చేసిన పనికి మెచ్చి 4.5 కోట్లు తనపై కురిపించారు(వీడియో)

ఇది కూడా చదవండి: ఆ రికార్డు కోసం గెడ్డం పెంచిన భామ

ఇది కూడా చదవండి: స్టూడెంట్సే కదా అని క్లోజ్ గా ఉంటే టీచర్ కి చుక్కలు చూపించారు(వీడియో)

English summary

Their is more chances to cause cancer for height people