ఆ ఊళ్ళో మగాళ్లే లేరు.. నిజంగా వింతే ఇది!

Their is no men in this village

12:54 PM ON 20th July, 2016 By Mirchi Vilas

Their is no men in this village

అవును మీరు విన్నది నిజమే.. ఆ ఊళ్ళో మగాళ్లే లేరు.. మగాళ్ళు లేకుండా గ్రామం ఏమిటి అనుకుంటున్నారా? ఇది నిజంగా నిజమే.. ఈ గ్రామంలో మగవాళ్ళు ఉండరు సరికదా ఈ ఊళ్లోకి బయట వాళ్ళని లోపలికి కూడా రానివ్వరట. కెన్యాలోని ఉమోజా అనే గ్రామంలో ఈ దుస్థితి ఏర్పడింది. మోసపోయిన మహిళలు, మగాళ్ళతో వేధింపులు పడలేనివాళ్ళు ఇలా ఏదోరకంగా మగాడంటే విసుగు వచ్చే ఆడవాళ్ళందరూ ఈ గ్రామానికి చేరుకుంటారు. పురుషులంటే అసహ్యంతో రెబెక్కా అనే మహిళ 25 ఏళ్ల క్రితం ఈ గ్రామాన్ని నిర్మించింది. ఆమెను తన భర్త ముందునే కొంతమంది మగవాళ్ళు కొడుతూ ఉంటే అతను ఏమీ పట్టించుకోకుండా ఉన్నాడని, ఇంకా ఇలాంటి ఎన్నో కారణాల వలన ఆమె ఈ గ్రామాన్ని నిర్మించింది అని ఆ గ్రామస్తులు చెప్తున్నారు.

మా అనుభవాలే మమ్మల్ని ఇలా తయారు చేశాయని, మమ్మల్ని నడిపించే శక్తి రెబెక్కానే అని తెలిపారు. ఈ గ్రామం 1990లో ఏర్పాటు చేయగా, ఇక్కడ ఆడవాళ్ళు అందరూ బంగారు ఆభరణాలు తయారు చేస్తూ జీవిస్తుంటారు. అదండి అసలు సంగతి..

English summary

Their is no men in this village