నేడు బ్యాంకుల్లో నోట్ల మార్పిడి లేదట.. ఎందుకో తెలుసా?

Their is no money exchange today in banks

11:55 AM ON 19th November, 2016 By Mirchi Vilas

Their is no money exchange today in banks

శనివారం నాడు అంటే నేడు దేశంలో ఏ బ్యాంక్ లోనూ నోట్ల మార్పిడి ఉండదు. కేవలం వయో వృద్ధులకు తప్ప మిగిలినవారెవరికీ ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్ల మార్పిడి ఉండదని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. కేవలం వృద్ధులను మాత్రం అనుమతిస్తారు. ఈ విషయాన్ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మెన్ రాజీవ్ రుషి వెల్లడించారు. అయితే ఆయా బ్యాంకులకు చెందిన ఖాతాదారులకు వారి బ్రాంచీలలో ఇతర సేవలు ఉంటాయని తెలిపారు. అయితే, హోం బ్రాంచీల ఖాతాదారులకు నోట్ల మార్పిడి ఉంటుందా లేదా అన్నది స్పష్టం కాలేదు. అన్ని బ్యాంకుల్లోనూ పెండింగ్ పని పూర్తి చేసుకుంటారని రుషి చెప్పారు.

ఇంక్ మార్క్ పెట్టడం వల్ల 40 శాతం క్యూలు తగ్గాయని కూడా రుషి వెల్లడించారు. కాగా ఆదివారం సెలవు దినం కావడంతో శనివారం నాడు వృద్ధులు మినహా, మిగిలినవారంతా వరుసగా రెండు రోజుల పాటు బ్యాంకుల దరిదాపులకు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. కాగా, హైదరాబాదులోని పలు బ్యాంకులు శుక్రవారం నాడు తమ ఖాతాదారులకు మినహా మిగిలినవారికి పాత నోట్లను మార్చుకునే అవకాశం ఇవ్వలేదు.

English summary

Their is no money exchange today in banks