హవ్వ!  తెలుగు రాష్ట్రాల్లో చూడ తగ్గ ప్రదేశాలే లేవా?

There Were No Tourist Places In Ap,Telangana

01:47 PM ON 30th December, 2015 By Mirchi Vilas

There Were No Tourist Places In Ap,Telangana

'అన్నింటా తెలుగు వారికి అన్యాయం' అని చాలామంది అనే మాట. ఇది ఎప్పుడూ మామూలే అంటూ కొందరు పెద్దలు పెదవి విరుపు సహజమే. కానీ ప్రపంచ చూడదగ్గ ప్రదేశాలు, భారత్‌లో చూడదగ్గ ప్రదేశాల జాబితాలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒక్కటి కూడా లేదంట

ఏపీ నుంచి నూతన రాజధాని అమరావతి, చంద్రగిరి కోట, గుంటుపల్లి బుద్ధిస్ట్ స్మారకంతో పాటు, తెలంగాణలో చార్మినార్, గోల్కొండ కోట వేటికీ చూడదగ్గ ప్రదేశాల జాబితాలో చోటు దక్కలేదు. ఆర్కియాలటీ సర్వే ఆఫ్ ఇండియా చూడదగ్గ ప్రదేశాల జాబితాను రూపొందించింది. భారత్‌లో 22, ప్రపంచంలో 21 చూడదగ్గ ప్రదేశాలను పొందుపర్చారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కదానికి చోటు దక్కలేద న్న విషయం ప్రస్తావిస్తే , ఇది కేవలం డ్రాఫ్ట్ జాబితా మాత్రమేనని, ఇందులో నుంచి కొన్ని తొలగించే అవకాశం లేదా, చేర్చే అవకాశముందనే మాట వినిపించడం షరా మామూలే.

వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితా పరిశీలిస్తే, .....

అజంతా - ఎల్లోరా గుహలు (ఔరంగాబాద్, మహారాష్ట్ర) ఎలిపెంట్ గుహలు (మహారాష్ట్ర) ఆగ్రా కోట (ఆగ్రా) తాజ్ మహల్ (ఆగ్రా) సూర్య దేవాలయం, కోనార్క్ టెంపుల్, పూరీ దేవాలయం (ఒడిశా) మహాబలిపురం (తమిళనాడు) చర్చిలు, మఠాలు (గోవా) ఖజురహో ఆలయాలు (మధ్యప్రదేశ్) హంపీ (కర్నాటక) ఫతేపూర్ సిక్రీ (ఉత్తర ప్రదేశ్) పత్తదకల్ దేవాలయాల సమూహం (కర్నాటక) తంజావూరులో చోళ టెంపుల్స్ (తమిళనాడు) సాంచీ బుద్ధిస్ట్ స్మారకం (మధ్యప్రదేశ్) హుమాయున్ సమాధి (ఢిల్లీ) కుతుబ్ మినార్ (ఢిల్లీ) ప్రీహిస్టోరిక్ రాక్ షెల్టర్స్, భింబేత్క (మధ్యప్రదేశ్) చాంపనర్ - పవాగా పార్క్ (గుజరాత్) ఎర్ర కోట (ఢిల్లీ) హిల్ ఫోర్ట్స్ (రాజస్థాన్) రాణి కీ వావ్ (గుజరాత్) వున్నాయి.

ఇండియన్ హెరిటేజ్ సైట్స్ జాబితా పరిశీలిస్తే,.....

హోసలేశ్వర దేవాలయం (హలెబీడు, కర్నాటక) ఉదయగిరి-ఖందగిరి గుహలు (భువనేశ్వర్, ఒడిశా) అశోకన్ రాక్ ఎడిక్ట్, స్కల్పచర్ ఆప్ ఎలిపెంట్ (భువనేశ్వర్) సన్ గాడ్ ఆఫ్ కటర్మాల్ (అల్మోరా, ఉత్తరాఖండ్) జాగేశ్వర్, వైద్యనాథ్ టెంపుల్స్ (ఉత్తరాఖండ్) గోల్ గుంబజ్ (కర్నాటక) బుద్ధిస్ట్ స్తూప (కల్బుర్గి, కర్నాటక) డీగ్ పాలెస్‌లు (భరత్‌పూర్, రాజస్థాన్) కూచ్ బీహార్ పాలెస్ (పశ్చిమ బెంగాల్) ఝాన్సీ ఫోర్ట్ (ఉత్తర ప్రదేశ్) లక్ష్మణాలయం (ఛత్తీస్‌గఢ్) రాక్ టెంపుల్స్ (మాస్రూర్, హిమాచల్ ప్రదేశ్) హిడింబాలయం (కుల్లు, హిమాచల్ ప్రదేశ్) కుడకల్లు పరంబు (చెరమనగడ్, కేరళ) వున్నాయి.
డ్రాఫ్ట్ జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో చూడ తగ్గ ప్రదేశాలు ప్రస్తావన లేకున్నా , ఆతర్వాత ఒరిజనల్ జాబితా లోనైనా ఉంటాయని ఆశిద్దామా ....

English summary

Government need to develop and explore tourism for ap and telengana to attracts tourists. Of coerce both states have good tourist places, but not listed single in heritage sites.