వీళ్ళందరూ కలిసి వ్యాపారం మొదలు పెట్టారు!

These 5 legends doing business with partnership

06:28 PM ON 1st June, 2016 By Mirchi Vilas

These 5 legends doing business with partnership

అవును మీరు విన్నది నిజమే! ఈ దిగ్గజాలన్నీ కలిసి వ్యాపారం మొదలు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ క్రికెట్ దగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ఇండస్ట్రియలిస్ట్ నిమ్మగడ్డ ప్రసాద్ వీళ్ళందరూ కలిసి ఒక వ్యాపారం మొదలు పెట్టారు. అదేంటంటే.. ఇంతవరకూ సచిన్ టెండూల్కర్ ఓనర్ గా ఉన్న(ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ ఫ్రాంచైజీ) 'కేరళ బ్లాస్టర్స్' లో ఇప్పుడు చిరు, నాగ్, అల్లు అరవింద్, నిమ్మగడ్డ భాగస్వామ్యం కాబోతున్నారు. ఇంతకుముందు సచిన్ తోపాటు కేరళ బ్లాస్టర్స్ కు పివిపి సంస్థ భాగస్వామిగా ఉండేది.

తాజాగా దీని నుంచి పీవీపీ సంస్థ తప్పుకోవడంతో కొత్త పార్టనర్స్ ని తీసుకుని సంస్థను మరింత విస్తీరణ చేయాలని సచిన్ భావించాడు. దీంతో ఈ కొత్త డీల్ మొదలు పెట్టారు. ఇదిలాఉంటే, మరోవైపు కేరళ ప్రభుత్వ కోరిక మేరకు ఆ రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో ఫుట్ బాల్ అకాడమీని స్థాపించి దేశవ్యాప్తంగా ఉన్న బాలలకు ఫుట్ బాల్ లో మంచి ట్రైనింగ్ ఇస్తుంది. ఈ అకాడమి కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. మొత్తం మీద దిగ్గజాలన్నీ కలిసి వ్యాపారం చేస్తుండటంతో అభిమానులకు పండగ వాతావరణం నెలకొంది.

English summary

These 5 legends doing business with partnership