మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటే మీ బ్యాటరీ కధ ముగిసినట్టే!

These applications will kill your phone battery

11:14 AM ON 24th September, 2016 By Mirchi Vilas

These applications will kill your phone battery

ఒకప్పుడు డబ్బున్న వాళ్ళకే ఫోన్ ఉండేది. కానీ అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని ప్రతిఒక్కరి చేతికి మొబైల్ వచ్చేసింది. పైగా ఇది అందరి అవసరం అయిపోయింది. అది లేకపోతే రోజు కాదు క్షణం గడవదు. ఇక మొబైల్ లో కొన్ని యాప్స్ ఉంటే, బ్యాటరీ గోవిందా. కొన్ని యాప్స్ వల్ల బ్యాటరీ పనితనం వేగంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. తక్కువ వాడే యాప్స్ ను ఎప్పటికప్పుడు తీసేస్తుండండి. అది మీకూ మంచిది, మీ ఫోన్ బ్యాటరీకి మంచిది. మీ టైమ్ మిగులుతుంది. బ్యాటరీ టైమ్ పెరుగుతుంది. ఇంతకీ అవేమిటో తెలుసుకుందాం..

1/7 Pages

ఫేస్ బుక్...


బ్యాటరీని తొందరగా ఖర్చు చేసే వాటిలో ఇదొకటి. కాని ఫేస్ బుక్ లేకపోతే మన పేస్ మనమే చూడలేము. ఫేస్ బుక్ కానీ మన ఫోన్ లో ఉందంటే ఛార్జింగ్ కు పని పెరుగుతుందన్న మాట. బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూనే నిత్యం నోటిఫికేషన్లను పంపిస్తుంటుంది ఎఫ్బి యాప్. దీంతో బ్యాటరీ మీద ఒత్తిడి పెరుగుతుంది. మెసెంజర్ తో కూడా ఇదే ఇబ్బంది. మిగిలిన సోషల్ మీడియా యాప్స్ స్నాప్ చాట్, స్కైప్, ఇన్ స్టాగ్రామ్ లదీ ఇదే తరహా సమస్య.

English summary

These applications will kill your phone battery. Don't use these applications in your smart phone. Because these applications may harm your battery life.